టమాటా అనేక రకాల వంటలలో ఉపయోగించే ఒక కూరగాయ. ఇది ఆహారం రుచిని పెంచడమే కాకుండా, దానిలో ఉండే పోషకాలు కూడా శరీరానికి మేలు చేస్తాయి. టమాటాలలో విటమిన్ సి, పొటాషియం, ఫోలేట్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అయితే, టమాటాలు తినడం కొంతమందికి హానికరం కావొచ్చు. ఆ వ్యాధులతో బాధపడే వారు వీటికి దూరంగా ఉండడమే మంచిదంటున్నారు నిపుణులు.
Also Read:Drunken Drive : ట్యాంక్ ఫుల్‌గా తాగి.. ట్రాఫిక్ పోలీసులకు ట్యాంకర్ డ్రైవర్…
మూత్రపిండాల సమస్యలు ఉన్న వారు
మూత్రపిండాల సంబంధిత వ్యాధులతో బాధపడేవారు టమాటాలను పరిమిత పరిమాణంలో తినాలి లేదా వైద్యుడిని సంప్రదించకుండా తినకూడదు. టమోటాలలో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఇది మూత్రపిండాలకు హానికరం. మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు పొటాషియం అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవద్దని వైద్యులు సూచిస్తుంటారు. ఎందుకంటే వారి మూత్రపిండాలు శరీరం నుంచి అదనపు పొటాషియంను తొలగించలేవు. ఇది హైపర్‌కలేమియా (పొటాషియం స్థాయిలు పెరగడం)కు దారితీస్తుంది. ఇది గుండెకు ప్రమాదకరం అవుతుంది.
Also Read:Online Betting : ఆన్‌లైన్ బెట్టింగ్ మాఫియాకు షాక్ – 126 కోట్లు ఫ్రిజ్, 3 మంది అరెస్ట్!
గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్న వారు
టమాటాలలో అధిక మొత్తంలో యాసిడ్ ఉంటుంది. ఇది గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారికి హానికరంగా మారుతుంది. అసిడిటీ, గుండెల్లో మంట లేదా గ్యాస్ వంటి సమస్యలు ఉంటే టమాటాలు తక్కువగా తినాలి. టమాటాలలో ఉండే సిట్రిక్ యాసిడ్, మాలిక్ యాసిడ్ కడుపులో యాసిడ్ స్థాయిని పెంచుతాయి. ఇది సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది.
Also Read:Sana Don : దొంగతనాలకు తల్లి స్కెచ్.. పిల్లలతో కలిసి చోరీలు.. చివరికి ట్విస్ట్.!
కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు
టమాటాలలో సోలనిన్ సమ్మేళనం ఉంటుంది. ఇది కొంతమందిలో కీళ్ల నొప్పులు, వాపులను పెంచుతుంది. ఆర్థరైటిస్ లేదా కీళ్ల నొప్పులతో బాధపడేవారు పరిమిత పరిమాణంలో టమాటాలు తినాలి. సోలనిన్ శరీరంలో కాల్షియం శోషణను ప్రభావితం చేస్తుంది. ఇది ఎముకలు, కీళ్ల సమస్యలను మరింత పెంచుతుంది.
Also Read:Sana Don : దొంగతనాలకు తల్లి స్కెచ్.. పిల్లలతో కలిసి చోరీలు.. చివరికి ట్విస్ట్.!
అలెర్జీలు ఉన్న వారు
కొంతమందికి టమాటాలు తింటే అలెర్జీకి గురయ్యే అవకాశం ఉంటుంది. టమాటాలలో ఉండే కొన్ని ప్రోటీన్లు శరీరంలో అలెర్జీలకు కారణమవుతాయి. టమాటాలు తిన్న తర్వాత దురద, దద్దుర్లు, వాపు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తితే టమాటా అలెర్జీకి సంకేతం కావచ్చు. అలాంటి వారు టమాటాలు అస్సలు తినకూడదు. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.