అతనో సాఫ్ట్ వేర్ ఉద్యోగి. ఏం చక్కా ఆఫీసులో ఏసీ కింద కూర్చుని పనిచేయాల్సిన వ్యక్తి రోడ్లపై గుంతలు పూడ్చుతున్నాడు. అంతేకాకుండా రోడ్డు మరమ్మత్తులకు దాదాపు 2.70 లక్షల రూపాయలను బ్యాంకు నుంచి అప్పు చేసి మరీ చేస్తున్నాడు. వినడానికి వింతగా ఉన్న ఈ ఘటన బెంగళూరు నగరంలో జరిగింది.
BRS Left Parties: బీఆర్ఎస్, లెఫ్ట్ పార్టీల మధ్య పొత్తుకు బ్రేక్..?
అసలు విషయమేంటంటే.. బెంగళూరులోని హోసా రోడ్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ముద్గల్(32) అనే వ్యక్తి.. తాను ఉండే ప్రదేశంలో రోడ్డు అధ్వాన్నంగా ఉంది. ఆ గుంతల్లో బ్యాలెన్స్ తప్పి ఓ డెలివరీ బాయ్.. తన కారును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో డెలివరీ బాయ్ కు తీవ్ర గాయాలయ్యాయి. తన కుటుంబాన్ని పోషించడానికి అతన సంపాదనే ఆధారం. ఇదే కాకుండా మరో ఘటన కూడా చోటు చేసుకుంది. గుంతలు భారీగా ఉండటంతో ఓ ఆటో బోల్తా పడి ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే పలుమార్లు ముద్గల్ అధికారులకు చెప్పినా ఫలితం లేదు. దీంతో విసిగిపోయిన ఆ సాఫ్ట్ వేర్ ఇంజినీర్.. గుంతలను పూడ్చేందుకు నిర్ణయించుకున్నాడు.
Posani Krishna Murali: నేను చస్తే.. నా శవాన్ని కూడా వారికి చూపించొద్దు
దీంతో నో డెవలప్ మెంట్ నో ట్యాక్స్ పేరుతో.. తన ఫ్రెండ్స్ తో కలిసి ఉద్యమం ప్రారంభించాడు. హోసా ప్రాంతంలోని రోడ్లను బాగుచేసేందుకు నిధులు సమీకరించారు. అయితే అవి సరిపోకపోవడంతో.. తాను పని చేసే ఐటీ కంపెనీ జీతం నుంచి 2 లక్షల 70 వేల రూపాయల అప్పు తీసుకున్నాడు. తమ ప్రాంతంలో ఉండే రోడ్లు బాగు చేసేందుకు ముందుకొచ్చిన అతని ఆలోచనను చూసి.. మిగతావారు అతనికి సాయం చేస్తున్నారు. దీంతో స్థానికులు సొంత నిధులతో రోడ్లు బాగు చేసుకుంటున్నారు.
CM KCR: వరంగల్ లో మేనిఫెస్టో ప్రకటిస్తా.. క్రమశిక్షణ తప్పితే.. తీసి అవతల పారేస్తా..
మరోవైపు ముద్గల్ ప్రభుత్వం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాడు. పన్నులు కడుతున్నా కానీ.. కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేడం లేదంటూ మండిపడుతున్నాడు. వసతులు కల్పించనప్పుడు పన్నులు ఎందుకు కట్టాలని ప్రశ్నిస్తున్నాడు. గుంతల రోడ్లలో ప్రయాణించి చాలా మంది వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని.. దీంతో తమ జీవితాన్ని కోల్పోతున్నారని.. వాళ్ల కుటుంబాలు అనాధులుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ గొప్ప ఆలోచనకు శ్రీకారం చుట్టినట్లుగా చెబుతున్నాడు. అయితే ఇలాంటి మంచి పని చేస్తున్న ఆ వ్యక్తిపై నెటిజన్లు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. బహుశా ప్రపంచంలోనే ఇలాంటి తరహా ఘటనలు ఎక్కడా జరగలేదని తెలుపుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రోడ్ల మరమ్మత్తులు చేయాలని నెటిజన్లు పేర్కొంటున్నారు.
