Earthquake: అసోంతోపాటు, అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో సోమవారం ఉదయం స్వల్పంగా భూకంపం సంభవించింది. భూమి కంపించడంతో ఆ ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. సోమవారం ఉదయం 8.03 గంటలకు అస్సాంలోని సోనిట్పుర్లో భూమి కంపించింది. దీని తీవ్రత 4.4గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. భూఅంతర్భాగంలో 15 కిలోమీటర్ల లోతులో కదలికలు చోటుచేసుకున్నాయని వెల్లడించింది. భూకంపంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే దీనివల్ల ఎలాంటి నష్టమూ జరగలేదని అధికారులు తెలిపారు. అండమాన్ నికోబార్ దీవుల్లో సైతం ఉదయం 7.48 గంటలకు భూమి కంపించిందని ఎన్సీఎస్ వెల్లడించింది. దీని తీవ్రత 4.8గా నమోదయిందని తెలిపింది. డిగ్లిపూర్కు సుమారు 137 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది. భూమి పొరల్లో 70 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు చోటుచేసుకున్నాయని వెల్లడించింది. ఆదివారం కొన్ని దేశాల్లోనూ భూకంపం సంభవించింది. అప్ఘానిస్థాన్ లోని ఫైజాబాద్ లో ఆదివారం సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.9గా నమోదైంది. పాకిస్థాన్ దేశంలోని కొన్ని ప్రాంతాలు, భారతదేశంలోని శ్రీనగర్, పూంచ్, జమ్మూ, ఢిల్లీ ప్రాంతాల్లోనూ భూప్రకంపనలతో సీలింగ్ ఫ్యాన్లు షేక్ అయినట్టు అధికారులు తెలిపారు.
Read Also: Kodali Nani: చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ ఎన్టీఆర్ వారసులా? బాలయ్య ఫొటో ఎందుకు పెట్టలేదు..?