Kodali Nani: ఎన్టీఆర్ వందో జయంతి వేడుకలు, టీడీపీ మహానాడుపై తీవ్ర విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి కొడాలి నాని.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎన్టీఆర్ 100వ జయంతిని టీడీపీ ఘనంగా చేపట్టలేదు అని ఆరోపించారు.. ఏటా మహానాడు జరగటానికి భిన్నంగా ఏం చేశారు? అని నిలదీశారు.. ఎన్టీఆర్ శత జయంతి పేరుతో చంద్రబాబుకు భజన చేసే వారిని పక్క రాష్ట్రాల నుంచి హీరోలను తెచ్చుకున్నారు.. పనికి మాలిన వెధవల్ని తెచ్చుకుని మిమ్మల్ని బండబూతులు తిట్టించటం.. ఇంద్రుడు, చంద్రుడు అని చంద్రబాబును పొగిడించుకోవడం వాళ్ల పనిఅంటూ విమర్శించారు.. అసలు చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ ఎన్టీఆర్ వారసులా? అని ప్రశ్నించారు కొడాలి.. మహానాడు వేదికపై నందమూరి బాలకృష్ణ ఫొటో ఎందుకు పెట్టలేదు? అని నిలదీశారు.. బాలయ్యను అమాయకుడిని చేసి వెనక తిప్పించుకుంటున్నారుగా అని ఫైర్ అయ్యారు.
లోకేష్ పాదయాత్రకు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న నందమూరి తారక్ ఫొటో ఎందుకు పెట్టలేదు? ఎన్టీఆర్ రక్తం పంచుకుని పుట్టినవారి ఫొటోలు కూడా ఉండవా? అని ప్రశ్నించారు కొడాలి నాని.. 2004, 2009లో ఇచ్చిన వాగ్దానాల్లో పూర్తి చేయలేదని ఒకటి చూపించినా వైసీపీని మూవేస్తామన్న ఆయన.. 450 వాగ్దానాలు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి రాగానే అన్నీ గాలికి వదిలేశాడని విమర్శించారు.. డ్వాక్రా, రైతుల రుణాలు మాఫీ అన్నాడు. .చేశాడా? ఆరోగ్య శ్రీ సంకనాకించేశాడు.. 2014లో రెండు వేల నిరుద్యోగ భృతి అన్నాడు.. 2019 ఫిబ్రవరిలో కొంత మందికి ఇచ్చాడు? పెన్షన్ పెంచుతాని 2019 వరకు పట్టించుకోలేదు.. 30 లక్షల మందికి చంద్రబాబు ఇస్తే.. జగన్ 60 లక్షల మందికి ఇస్తున్నారు అని పేర్కొన్నారు.. విద్యార్థులకు ల్యాప్ టాప్ లు ఇస్తాను అన్నాడు.. ఒక్క విద్యార్ధికి ఒక్క ల్యాప్ టాప్ అయినా ఇచ్చాడా? ఇన్నాళ్ళు ఏం చేయకుండా ఇప్పుడు ఏదో చేస్తాను అంటున్నాడు అంటూ మండిపడ్డారు. మహానాడు అంటే ఇదా? స్క్రాప్ వెధవలతో వేదిక పై వాగించటమా? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.
తమ్ముళ్ళు అదిరిందా అంటున్నాడు.. వచ్చే ఏడాది బాగా అదిరిపోతుంది చంద్రబాబుకు అంటూ ఎద్దేవా చేశారు కొడాలి.. బీసీలు వెన్నుముక అంటాడు.. వెనుక పవన్ కళ్యాణ్, రామోజీ రావును పెట్టుకుంటాడు.. వీళ్ళు బీసీలా? అని ప్రశ్నించారు.. రాజశేఖరరెడ్డి, జగన్ కలిసి 55 లక్షల ఇళ్ళు కట్టారు.. వీటిలో 40 లక్షల ఇళ్ళు బీసీలకే.. ఈ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అగ్రకుల పేదలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న వ్యక్తి జగన్ అని స్పష్టం చేశారు.. చంద్రబాబు కేబినెట్‌లో 15 మంది ఓసీలు ఉంటే.. జగన్ కేబినెట్‌లో 17 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే ఉన్నారని తెలిపారు.. ఒక్క బీసీను అయినా రాజ్యసభకు పంపించాడా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. బీసీలకు వెన్నుముకగా నిలిచింది ఎన్టీఆర్ అని వెల్లడించారు. చంద్రబాబు చెప్పిన క్యాష్ వార్ కరెక్టే.. చంద్రబాబు అధికారం పోగానే వీళ్ళ వెనుక ఉన్నవాళ్ళు వ్యాపారాలు లాస్ లోకి వెళ్ళాయి.. బట్టల షాపా.. నగల షాపా.. ఆకర్షణీయమైన మ్యానిఫెస్టో అంటున్నాడు అని సెటైర్లు వేశారు.. చంద్రబాబు బొంబాయిగాడు.. బొంబాయి మ్యానిఫెస్టో.. వేరే పార్టీల మ్యానిఫెస్టోలు కాపీ కొట్టి నాలుగు హామీలు అంటున్నాడు అంటూ విరుచుకుపడ్డారు కొడాలి నాని.