ఒక సినిమా విడుదల అవ్వడం కోసం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.. అలాగే ఓటీటీ లో కూడా విడుదల అవ్వడం కూడా ఈ మధ్య కష్టంగా మారింది.. పెద్ద సినిమాలు సైతం ఓటిటి బిజినెస్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. చిన్న సినిమాల సంగతి అయితే చెప్పక్కర్లేదు.. ఇప్పుడు రవితేజ సినిమాకు కూడా అలాంటి కష్ఠాలు ఎదురయ్యాయి..
అయితే సంక్రాంతికి ఎక్కువ సినిమాలు ఉండటంతో సోలో రిలీజ్ డేట్ కోసం ‘ఈగల్’ తప్పుకుంది. ఫిబ్రవరి 9 న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి ఓటీటీ బిజినెస్ అవ్వలేదు అనే టాక్ కొద్దిరోజుల క్రితం వినిపించింది.. ప్రస్తుతం ఓటీటీ లోకి రావడానికి రెడీ అవుతుంది.. శాటిలైట్ బిజినెస్ ఆల్రెడీ డౌన్ గా ఉంది. దాంతో అందరి దృష్టీ ఓటిటి డీల్స్ మీదే ఉంది. దాంతో నిర్మాతలు సైతం ఈ సినిమాకు ఓటిటి డీల్ పైనే ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తుంది..
ప్రస్తుతం ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ పై టి.జి.విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు వివేక్ కూచిభొట్ల సహా నిర్మాతగా వ్యవహరించారు.. అయితే ఈ సినిమాకు మొత్తం 70 కోట్ల రూపాయలతో నిర్మించారు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా రిలీజ్‌కు ముందు మంచి బజ్ క్రియేట్ చేయడంతో ఈ సినిమాను ఏపీ, నైజాంలో కలిపి 700 స్క్రీన్లు, ప్రపంచవ్యాప్తంగా 1000 స్క్రీన్లకుపైగా రిలీజ్ చేశారు.. మరి ఓటీటీ లో ఎక్కడ విడుదల అవుతుందో.. ఎంత బిజినెస్ అవుతుందో చూడాలి..