NTV Telugu Site icon

Deputy CM Pawan Kalyan: నామినేటెడ్ పోస్టులపై పవన్‌ కీలక వ్యాఖ్యలు.. నాగబాబుకు పదవి..!?

Pawan 2

Pawan 2

Deputy CM Pawan Kalyan: నామినేటెడ్ పోస్టుల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌… జనసేన కార్యాలయంలో పార్టీ ప్రజాప్రతినిధులను సత్కరించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడిన వారిని మర్చిపోమని స్పష్టం చేశారు.. హరిప్రసాద్ కు గుర్తింపు లభించినట్టే అందరికీ గుర్తింపు ఉంటుందన్న ఆయన.. నామినేటెడ్ పోస్టులు ఉంటాయి.. కానీ, ప్రతి ఒక్కరూ ఛైర్మన్ పదవులు ఆశిస్తే కష్టం. కొందరు టీటీడీ ఛైర్మన్ సహా ఇంకొన్ని ఛైర్మన్ల పదవులు అడగుతున్నారు. ఒక్క టీటీడీ ఛైర్మన్ పదవి కోసమే 50 మంది అడిగారు.. కానీ, ఆ పదవి ఒక్కరికే ఇవ్వగలరు. అయితే, నా కుటుంబ సభ్యులెవరూ టీటీడీ ఛైర్మన్ పదవి అడగలేదు.. కానీ, నా కుటుంబ సభ్యులు టీటీడీ ఛైర్మన్ పదవి అడిగారని ప్రచారంలో పెట్టారు.. అది కరెక్ట్ కాదు.. అని హితవుపలికారు.

Read Also: OTT release: ఎట్టకేలకు ఓటీటీలోకి అడుగు పెడుతున్న సుధీర్ బాబు సినిమా..ఎప్పుడు ఎక్కడంటే..?

ఈ పదవుల కోసం చంద్రబాబుని ఎలా అడగాలో తనకు తెలియడం లేదని వ్యాఖ్యానించారు పవన్‌ కల్యాణ్‌.. మీకిది చేశాం కాబట్టి.. మాకు ఈ పదవి ఇవ్వండి అని అడగలేం.. కానీ, అందరికీ న్యాయం చేసేలా నా వంతు ప్రయత్నం చేస్తా అన్నారు.. ఇదే సమయంలో ఎవరికైనా పదవి ఇవ్వలేకుంటే పెద్ద మనస్సుతో ఆలోచించాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోడీని నేనూ కేబినెట్ పదవి అడగగలను.. కానీ, నేను అడగలేదు. పదవుల కోసం మనం పని చేయడం లేదు. ఎవరైనా ఏమైనా పదవి కావాలంటే అడగండి.. కమిటీలో చర్చించి పదవులిచ్చే ప్రయత్నం చేస్తాం అన్నారు. పదవులు అడిగే వాళ్లు.. వాళ్ల అనుభవాలను.. వారి అర్హతలకు దగ్గరగా ఉండే పదవులు అడగండి. లా అండ్ ఆర్డర్ విషయంలో అందరూ ఆలోచన చేయాలన్నారు.. నంద్యాల ఘటనల్లాంటివి జరగ్గకుండా ఉండాలంటే ఏం చేయాలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలన్నారు. ఇక, మనోహర్ సివిల్ సప్లైస్ శాఖను సమర్ధవంతంగా పని చేస్తున్నారు. అక్రమంగా రేషన్ బియ్యం కట్టడికి నాదెండ్ల చర్యలు తీసుకుంటున్నారు. కేబినెట్‌లో రేషన్ అక్రమాలు సహా.. రాష్ట్రాభివృద్ధి కోసం చర్చిస్తాం అన్నారు. మరోవైపు.. కేంద్రంలోకి రావాలని.. మంత్రి పదవి ఇస్తామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కానీ, రాష్ట్రంలోనే ఉంటానని చెప్పాను. అడగాల్సిన టైంలో రాష్ట్రం కోసం ప్రధానిని అడుగుతా.. స్టీల్ ప్లాంట్ అభివృద్ధి, రైల్వే జోన్, 20 లక్షల మందికి ఉపాధి, ఉద్యోగాలను అడుగుతా అని వ్యాఖ్యానించారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.