Site icon NTV Telugu

Duvvada Srinivas: వైఎస్ జగన్ అవకాశం ఇవ్వకపోతే.. సొంతగా పోటీ చేసి నా బలం చూపిస్తా!

Ys Jagan, Duvvada Srinivas

Ys Jagan, Duvvada Srinivas

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి ఏపీ అసెంబ్లీలో వైసీపీ బహిష్కృత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ను పిలిచి మాట్లాడిన ఘటన రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వైఎస్ జగన్‌కు దువ్వాడ ఎదురుపడ్డారు. అసెంబ్లీ నుంచి బయటకు వచ్చే సమయంలో జగన్‌ను దువ్వాడ కలిశారు. దువ్వాడను చూసిన జగన్.. స్నేహపూర్వకంగా ‘ఏం చేద్దాం శ్రీనివాస్?’ అంటూ పలకరించారు. ధర్మానతో ఉన్న అంశాలపై మాట్లాడాలని దువ్వాడ అభ్యర్థించారు. సమగ్రంగా చర్చించేందుకు తాడేపల్లిలోని తన నివాసానికి రావాలని దువ్వాడను జగన్ ఆహ్వానించారు.

వైసీపీ నుంచి సస్పెండ్ చేసినా సమావేశాల సమయంలో అసెంబ్లీకి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వస్తున్నారు. గతంలో ఆయనపై వచ్చిన వివాదాల నేపథ్యంలో ఏడు నెలల క్రితం వైసీపీ నుంచి పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసింది. ఇవాళ అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి బయటకు వచ్చే సమయంలో వైఎస్ జగన్‌ను దువ్వాడ కలిశారు. ప్రస్తుత పరిణామాలను జగన్‌కు వివరించే ప్రయత్నం చేయగా.. తర్వాత మాట్లాడదాం అంటూ మాజీ సీఎం వెళ్లిపోయారు. మండలిలో ప్రజా సమస్యలపై వ్యక్తిగత అజెండాతో ముందుకు వెళ్లే ఆలోచనలో దువ్వాడ ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: AP Assembly 2026: 17 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు.. ఫిబ్రవరి 14న బడ్జెట్!

త్వరలో వైఎస్ జగన్‌ను కలుస్తానని, వైసీపీలో అవకాశం ఇవ్వకుంటే సొంతగా పోటీ చేసి బలం చూపిస్తా అని దువ్వాడ శ్రీనివాస్ చెప్పారు. మీడియాతో దువ్వాడ మాట్లాడుతూ… ‘మండలిలో ప్రజా సమస్యలపై ప్రస్తావిస్తా. వైఎస్ జగన్‌ను త్వరలోనే కలుస్తాను. తిరుమల లడ్డూ వ్యవహారంలో భక్తుడి వైపు మాట్లాడతాను. మెడికల్ కాలేజీలని పీపీపీ విధానంలో నిర్మించాల్సిన అవసరం లేదు. జగన్ అవకాశం ఇవ్వకపోతే.. సొంతగా పోటీ చేసి నా బలం చూపిస్తాను’ అని చెప్పారు.

Exit mobile version