బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ ‘ డంకీ’.ఇప్పటికే డంకీ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ మరియు ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రాజ్‌కుమార్ హిరానీ మరోసారి తన మార్క్ చూపించేందుకు రెడీ అయ్యారని అంతా కూడా భావించారు. దాంతో డంకీ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి..మరోవైపు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజీయెస్ట్ మూవీ సలార్ కూడా ఒక రోజు గ్యాప్ తో రిలీజ్ కావడంతో ఈ రెండు సినిమాల మధ్య బాక్సాఫీస్స్ వార్ నెలకొంది. ఈ నేపథ్యంలో నేడు (డిసెంబర్ 21) షారుక్ ఖాన్ నటించిన డంకీ మూవీ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. ఇప్పటికే షారుక్ పఠాన్ మరియు జవాన్ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని భారీగా వసూళ్లు సాధించాడు. ఇప్పుడు డంకీతో మరోసారి హాట్రిక్ కొట్టనున్నాడని తెలుస్తోంది.అయితే, పఠాన్, జవాన్ తరహాలోనే హిందీతోపాటు తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో డంకీని విడుదల చేద్దామనుకున్నారు. కానీ, ఆఖరి నిమిషంలో కేవలం హిందీలోనే డంకీ మూవీని రిలీజ్ చేశారు.
డంకీ సినిమాకు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.సూపర్ ఫిల్మ్ అంటూ నెటిజన్స్ ఎక్స్ లో పోస్ట్స్ షేర్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో డంకీ ఓటీటీ స్ట్రీమింగ్ విషయాలు ఆసక్తిగా మారాయి. డంకీ మూవీ జియో సినిమా ఓటీటీలో విడుదల కానుంది. కొద్ది రోజుల క్రితం జరిగిన ఓ ఈవెంట్‌లో జియో స్టూడియోస్ ప్లాట్‌ఫామ్‌లో రానున్న సినిమాలు మరియు సిరీస్‌ల జాబితాను ఆవిష్కరించారు. ఆ లిస్ట్‌లో షారుక్ డంకీ సినిమా కూడా ఉంది. కాబట్టి నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ మరియు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కాకుండా ఊహించని విధంగా జియో సినిమాలో డంకీ స్ట్రీమింగ్ కానుంది.డంకీ సినిమాని జియో సినిమా రూ. 155 కోట్లు పెట్టి కొనుగోలు చేసిందని సమాచారం. ఇక సినిమా టాక్, కలెక్షన్స్ ను బట్టి డంకీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను ప్రకటించనున్నారట సాధరణంగా థియేట్రికల్ రిలీజ్ నాలుగు వారాల తర్వాత ఓటీటీలో విడుదల చేస్తారనే విషయం తెలిసిందే. దీనితో దానికి సినిమా సంక్రాంతికి గాని రిపబ్లిక్ డే కానుకగా గాని ఓటీటీ లోకి రావొచ్చు.