Dulquer Salmaan: వరుస తెలుగు సినిమాలతో రచ్చకు రెడీ అవుతున్న మాలీవుడ్ స్టార్ కిడ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dulquer Salmaan: మాలీవుడ్ స్టార్ కిడ్‌గా సినిమాల్లోకి అడుగుపెట్టిన దుల్కర్ సల్మాన్.. తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఎప్పుడో మన హీరో అయిపోయాడు. మమ్ముట్టి తనయుడిగా సినీ కుటుంబం నుంచి వచ్చినా.. తన టాలెంట్‌తో సౌత్ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా టాలీవుడ్లో వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్నాడు.
‘మహానటి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన దుల్కర్.. ఆ తర్వాత ‘సీతారామం’తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. లెఫ్టినెంట్ రామ్ పాత్రలో అద్భుతమైన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. ఈ సినిమాతో దుల్కర్‌కు తెలుగులో భారీ క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత ‘లక్కీ భాస్కర్’తో మరోసారి బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ అందుకుని.. టాలీవుడ్లో తన మార్కెట్‌ను మరింత బలోపేతం చేసుకున్నాడు.
Also Read
- Minister Ramprasad Reddy: అది విజ్ఞప్తి.. ఆదేశం కాదు.. భక్తి కార్యక్రమాన్ని రాజకీయ వివాదంగా మార్చొద్దు..
- Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
- Deepika Padukone: ప్రెగ్నెంట్ అయితే రెస్ట్ తీసుకోవాలా.. మరో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్.?
- Nara Lokesh: గణేష్ నిమజ్జనం వేళ డీజేలపై స్పందించిన లోకేష్.. హోంమంత్రి, డీజీపీకి విజ్ఞప్తి
తెలుగు సినిమాలతో హ్యాట్రిక్ విజయాలు అందుకున్న తర్వాత దుల్కర్ కొంత గ్యాప్ తీసుకుని తమిళ, మలయాళ చిత్రాలపై ఫోకస్ పెట్టాడు. ఈ క్రమంలో ‘కాంత’, ‘ఐ యామ్ గేమ్’ వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ చిత్రాలకు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో స్పందన రాలేదనే టాక్ వినిపించింది. దీంతో ఇప్పుడు మళ్లీ తెలుగు సినిమాలపై దుల్కర్ ఫోకస్ పెంచుతున్నాడనే వార్తలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ చేతిలో 2 తెలుగు ప్రాజెక్టులు ఉన్నాయి. పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆకాశంలో ఓ తార’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో దుల్కర్ సరసన సాత్విక వీరవల్లి హీరోయిన్గా నటిస్తుండగా.. శృతి హాసన్ కీలక పాత్రలో కనిపించనుంది. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాస్, లైట్ బాక్స్ మీడియా బ్యానర్లపై నిర్మిస్తున్నారు.
మరోవైపు ‘శ్రీ శ్రీ’ అనే తెలుగు ప్రాజెక్ట్‌లోనూ దుల్కర్ నటిస్తున్నాడు. దీంతో వరుసగా తెలుగు సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటివరకు తెలుగులో చేసిన సినిమాలతో మంచి విజయాలు అందుకున్న దుల్కర్.. రాబోయే చిత్రాలతోనూ అదే సక్సెస్ స్ట్రీక్‌ను కొనసాగిస్తాడా అనేది వేచిచూడాలి.
తాజావార్తలు
-
Dulquer Salmaan: వరుస తెలుగు సినిమాలతో రచ్చకు రెడీ అవుతున్న మాలీవుడ్ స్టార్ కిడ్..!
-
Minister Ramprasad Reddy: అది విజ్ఞప్తి.. ఆదేశం కాదు.. భక్తి కార్యక్రమాన్ని రాజకీయ వివాదంగా మార్చొద్దు..
-
Passport New Rules 2026: పాస్‌పోర్ట్ నిబంధనలు, ఫీజుల్లో మార్పులు.. కొత్త ఛార్జీలు ఇవే
-
Biggest Flop Movies : ఈ ఏడాది డిస్ట్రిబ్యూటర్స్ కు భారీ నష్టాలు తెచ్చిన టాప్ సినిమాలు ఇవే..
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
ట్రెండింగ్
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
-
Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!