Dude:‘డ్యూడ్’.. టెలివిజన్ ప్రీమియర్ డేట్ ఫిక్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళంలో సెన్సేషనల్ హిట్ సాధించిన రోమాంటిక్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ ‘డ్యూడ్’ (Dude) ఇప్పుడు తెలుగు బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది. ‘లవ్ టుడే’ ఫేమ్ ప్రదీప్ రంగనాథన్, ‘ప్రేమలు’ బ్యూటీ మమితా బైజు జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి కీర్తీశ్వరన్ దర్శకత్వం వహించారు. సాయి అభ్యంకర్ అందించిన సంగీతం, ముఖ్యంగా ఇందులోని పాటలు సోషల్ మీడియాలో భారీగా ట్రెండ్ అయ్యాయి. ప్రదీప్ రంగనాథన్ కామెడీ టైమింగ్, మమితా బైజు యాక్టింగ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. శరత్ కుమార్, రోహిణి వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో కనిపించారు. ఇప్పుడు ఈ క్రేజీ మూవీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్‌ను లాక్ చేసుకుంది.
Also Read : Karuppu: త్రిష వల్లే ‘కరుప్పు’ సినిమాకు కొత్త ఎనర్జీ వచ్చిందంటూ దర్శకుడు ఆసక్తికర కామెంట్స్
Also Read
ప్రముఖ తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్ జీ తెలుగు (Zee Telugu) ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంది. తాజాగా విడుదలైన పోస్టర్ ప్రకారం, ఈ సినిమా ఏప్రిల్ 19, ఆదివారం సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది. సండే ఈవెనింగ్ ఫ్యామిలీతో కలిసి ఫుల్లుగా నవ్వుకోవడానికి ఇదొక మంచి మూవీ అని చేప్పోచ్చు.
తాజావార్తలు
-
Gas Cylinder Racket : హైదరాబాద్‌లో అక్రమ గ్యాస్ దందా.. 750 సిలిండర్లు సీజ్.!
-
OTR: సామేల్‌కు చెక్ పెట్టడానికే సోమన్న ప్రస్తావన? కోమటిరెడ్డి బ్రదర్స్ వ్యూహం ఇదేనా?
-
SSC జాబ్ కావాలా? ఈ 3 స్టెప్స్ ఫాలో అయితే ప్రిపరేషన్ ఈజీ!
-
OTR: ఈ.. నటన ఏదైతే ఉందో…!
-
OTR: తెలంగాణ పాలిటిక్స్‌లో ‘క్షుద్ర పూజల’ కలకలం.. హరీష్ రావుపై ఆరోపణల వెనుక అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!