ఏపీలో పలువురు పోలీసు అధికారులను బదిలీ చేశారు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి. 77 మంది డిఎస్పిల ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దిశ డిఎస్పీ వాసుదేవన్.. పుట్టపర్తి డిఎస్పీ గా బదిలీ..కడప డిఎస్పీ బి.వి.శివారెడ్డి.. అనంతపురం రూరల్ డిఎస్పీ గా బదిలీ చేశారు. జమ్మలమడుగు డిఎస్పీ నాగరాజు.. ఏసీబీ డిఎస్పీ గా బదిలీ అయ్యారు. కడప ఏసీబీ డిఎస్పీ కంజక్షన్ హిందుపురం డిఎస్పీ గా బదిలీ చేశారు. తిరుపతి డిటిసి డిఎస్పీ ఎండి షరీఫ్ కడప డిఎస్పీ గా నియమించారు. ఆదోని డిఎస్పీ వినోద్ కుమార్. పులివెందుల డిఎస్పీ గా నియమించారు. తాడిపత్రి డిఎస్పీ చైతన్య కుమార్.. రాజంపేట డిఎస్పీ గా నియమించారు.
సత్యసాయి జిల్లా ఎస్బి డిఎస్పీ ఉమామహేశ్వర రెడ్డి జమ్మలమడుగు డిఎస్పీ గా నియమించారు. ఒంగోలు డీఎస్పీగా టి.అశోక్ వర్ధన్..మార్కాపురం డీఎస్పీగా జి.వీర రాఘవరెడ్డి నియామకం చేశారు. బెజవాడ సెంట్రల్ ఏసీపీగా భాస్కర రావుని నియమించారు. పశ్చిమ ఏసీపీగా జనార్ధన రావు, నందిగామ డీఎస్పీగా జనార్ధన నాయుడు, మచిలీపట్నం డీఎస్పీగా మాధవ రెడ్డి, గన్నవరం డీఎస్పీగా జయసూర్య, గుడివాడ డీఎస్పీగా శ్రీకాంత్ ని నియమించారు డీజీపీ. అలాగే అవనిగడ్డ డీఎస్పీగా మురళీధర్, విజయనగరం ఎస్డీపీవో గా కాళిదాస్..చీపురుపల్లి ఎస్డీపీవోగా చక్రవర్తిని నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
Read Also: Red Alert : తెలంగాణలో కొనసాగుతున్న వర్షం.. హైదరాబాద్ కు రెడ్ అలర్ట్
అమలాపురం డిఎస్పీ మాధవ రెడ్డి బదిలీ అయ్యారు. ఆయన్ని మచిలీపట్నం డిఎస్పీ గా బదిలీ చేశారు. మార్కాపురం డిఎస్పీ ఎం. కిషోర్ కుమార్ బదిలిపై అమలాపురం డిఎస్పీ గా రానున్నారు. రామచంద్రాపురం డిఎస్పీ గా అంబికా ప్రసాద్ , ఇక్కడ పని చేసిన డిఎస్పీ బాలచంద్రా రెడ్డిని టెక్కలి డిఎస్పీ గా బదిలీ అయ్యారు. అనకాపల్లి SDPO సునీల్ కి బదిలీ అయ్యారు. సునీల్ కి విశాఖ క్రైమ్ ఏసిపి గా బదిలీ చేశారు. ఏసీబీ డీఎస్పీ గా ఉన్న సుబ్బ రాజుకి అనకాపల్లి SDPO గా బదిలీ చేశారు. హార్బర్ ఏసిపి శిరీష కి నెల్లూరు కి బదిలీ అయ్యారు. నార్త్ విశాఖ ఏసిపి శ్రీనివాస రావు కి హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆర్డర్ జారీచేశారు. కాశీబుగ్గ లో SDPO గా విధులు నిర్వహిస్తున్న శివరాం రెడ్డి కి విశాఖ నార్త్ ఏసిపి గా బదిలీ చేశారు.
Read Also: Karnataka polls: యడియూరప్ప ఒత్తిడిలో మాట్లాడుతున్నారు.. మాజీ సీఎంపై షెట్టర్ ఆసక్తికర వ్యాఖ్య