Site icon NTV Telugu

Bihar: తాగి ఆలస్యంగా వచ్చిన వరుడు.. పెళ్లి క్యాన్సిల్

Groom Bihar

Groom Bihar

పెళ్లంటే ఎంతో హడవిడి ఉంటుంది. అనుకున్న సమయానికి పెళ్లి జరగాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. అందుకోసం పెళ్లి ఏర్పాట్లు చకాచకా కానిస్తారు. కానీ.. ఇక్కడ ఓ వింత ఘటన జరిగింది. వరుడు మద్యం తాగి ఆలస్యంగా వచ్చాడని వధువు వివాహాన్ని రద్దు చేసింది. ఈ ఘటన బీహార్‌లోని కటిహార్‌లో జరిగింది. అంతేకాకుండా.. పెళ్లి ఏర్పాట్ల కోసం ఖర్చైన రూ. 4 లక్షలు ఇవ్వాలని వరుడు తల్లిదండ్రులను డిమాండ్ చేసింది.

పెళ్లికి వచ్చిన అతిధుల కోసం అమ్మాయి కుటుంబ సభ్యులు తమ స్టేటస్‌కు తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు. అయితే వరుడు మంజిత్ చౌదరి కుర్సేలలోని కళ్యాణ మండపంలో పెళ్లి ఊరేగింపుగా రావాలి. వధువు తరుఫు బంధువులు చాలా సేపు ఎదురుచూశారు. రాత్రి అయినా రాలేదు.. కోపంతో ఊగిపోతున్న బంధువులు చుట్టు పక్కల వెతికి చూడగా ఓ కారులో అపస్మారక స్థితిలో ఉన్నాడు. అయితే ఉదయం పెళ్లి మండపం దగ్గరికి తీసుకొచ్చి చూడగా వరుడు మద్యం మత్తులో ఉన్నాడు.

BJP: కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్‌.. బీజేపీలో చేరిన కీలక నేత

తనకు కాబోయే వరుడి పరిస్థితి చూసి వధువు మనీషా పెళ్లికి నిరాకరించింది. మంజిత్ కళ్యాణ మండపానికి వస్తుండగా మద్యం తాగించారని, పెళ్లి ఖర్చుల కోసం ఖర్చు చేసిన రూ.4 లక్షలను తన కుటుంబానికి ఇవ్వాలని వధువు తెలిపింది. డబ్బులు చెల్లించే వరకు మంజిత్‌తో పాటు అతని తల్లిదండ్రులను వదిలిపెట్టేది లేదని పేర్కొంది. దీంతో.. వరుడు తరుఫు బంధువులు డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఈ ఘటనపై మంజిత్ చౌదరి మాట్లాడుతూ.. తాను పెళ్లి మండపానికి బయల్దేరే ముందు తన స్నేహితులు కారులోకి ఎక్కి మత్తు కలిగించే పదార్థాలను తినమని చెప్పారని అన్నాడు. వారు ఏమీ ఇచ్చారో నాకు తెలియదు.. కానీ అవి తినగానే మత్తులోకి జారుకున్నట్లు చెప్పాడు. మరోవైపు.. వధువు సోదరుడు మాట్లాడుతూ, మంజిత్ అనారోగ్యంతో ఉన్నట్లు తన కుటుంబ సభ్యులు అబద్ధం చెబుతున్నారని, అతను మద్యానికి బానిస అని అన్నాడు.

Exit mobile version