Myanmar: బంగ్లాదేశ్‌కు పారిపోతున్న రోహింగ్యాలపై డ్రోన్ దాడి..200 మందికి పైగా మృతి
- మయన్మార్ నుంచి మరోసారి బాధాకరమైన వార్త
- మయన్మార్ విడిచి బంగ్లాదేశ్‌కు పారిపోతున్న రోహింగ్యాలపై డ్రోన్ దాడి
- ఇందులో 200 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోహింగ్యాలకు సంబంధించి మయన్మార్ నుంచి మరోసారి బాధాకరమైన వార్త వెలువడింది. మయన్మార్ విడిచి బంగ్లాదేశ్‌కు పారిపోతున్న రోహింగ్యాలపై డ్రోన్‌ల ద్వారా దాడులు చేశారు. ఇందులో 200 మందికి పైగా మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో మహిళలు, పిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. నాఫ్ నది గుండా బంగ్లాదేశ్ లోకి ప్రవేశించేందుకు వారు ప్రయత్నించగా వారిపై దాడి జరిగింది. బంగ్లాదేశ్ సరిహద్దులో దాడి జరిగిందని సాక్షులు చెప్పారు. ఇది రాఖైన్ రాష్ట్రంలో జరిగిన అత్యంత ఘోరమైన దాడిగా అధికారులు అభివర్ణించారు. గర్భిణీ స్త్రీతో పాటు ఆమె 2 ఏళ్ల కుమార్తె కూడా మరణించారని చెప్పారు. ఈ దాడికి మిలీషియా, మయన్మార్ సైన్యం పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. బంగ్లాదేశ్ సరిహద్దులు దాటేందుకు ప్రజలు వేచి ఉన్న సమయంలో ఈ దాడి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. గత కొన్ని వారాలుగా మయన్మార్ మిలటరీ (జుంటా), అరాకన్ ఆర్మీ(రెబెల్స్) కు మధ్య భీకర పోరు జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ దాడి జరిగింది.
READ MORE: Bangladesh : బంగ్లాదేశ్‌లో హింస తర్వాత.. ఇప్పుడు మరో సంక్షోభం.. ప్రజల ఆరాటం దేనికంటే?
Also Read
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్టు 1 నుంచి ప్రారంభం..
- FIFA World Cup 2026 Final: స్పెయిన్ VS అర్జెంటీనా.. గెలిచేది ఎవరో చెప్పిన రొనాల్డో
- ROKO: చరిత్ర స్పష్టించిన రోహిత్, విరాట్ కోహ్లీ.. ఇంకా ఎన్ని రికార్డులు అందుకుంటారో..
- Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించడం సరైనదే: ఢిల్లీ హైకోర్టు
సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో.. మృతదేహాలు బురదలో చెల్లాచెదురుగా కనిపించాయి. వాటి చుట్టూ సూట్‌కేసులు, బ్యాక్‌ప్యాక్‌లు తేలియాడుతున్నాయి. ముగ్గురు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. 200 మందికి పైగా మరణించారని, మరొకరు 70 మందికి పైగా మరణించారని చెప్పారు. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. ఈ దాడి మయన్మార్ తీరప్రాంత నగరమైన మౌంగ్‌డావ్ వెలుపల జరిగింది. మహమ్మద్ ఇలియాస్ (35) అనే ప్రత్యక్ష సాక్షి, తన గర్భవతి అయిన భార్య, 2 సంవత్సరాల కుమార్తెను కోల్పోయాడు. డ్రోన్‌లు గుంపుపై దాడి చేయడం ప్రారంభించినప్పుడు.. తాను నదిలో వారితో నిలబడి ఉన్నానని ఇలియాస్ చెప్పాడు.
Drone attack
తాజావార్తలు
-
AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్టు 1 నుంచి ప్రారంభం..
-
Dreaming: మీరు చనిపోయినట్లు కల వస్తుందా? షాక్ అయ్యే నిజం ఇదే!
-
Se*xual Harassment : పోలీస్ అకాడమీలో పోకిరి.. లేడీ ట్రైనీ IPSపై లైంగిక వేధింపులు..
-
FIFA World Cup 2026 Final: స్పెయిన్ VS అర్జెంటీనా.. గెలిచేది ఎవరో చెప్పిన రొనాల్డో
-
ROKO: చరిత్ర స్పష్టించిన రోహిత్, విరాట్ కోహ్లీ.. ఇంకా ఎన్ని రికార్డులు అందుకుంటారో..
ట్రెండింగ్
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!