Site icon NTV Telugu

School Bus: స్కూల్ బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు గుండెపోటు.. చివరికి ఏమైందంటే..?

Bus Driver Heart Attack

Bus Driver Heart Attack

Driver Gets Heart Attack while Driving The School Bus in Addanki: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లా అద్దంకిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు స్కూల్ బస్సు నడుపుతున్న డ్రైవర్‌కు ఉన్నపళంగా గుండెపోటు వచ్చి మృతి చెందాడు. దాంతో స్కూల్ బస్సు రోడ్డు మధ్యలోనే ఆగిపోయింది. డ్రైవర్‌కు గుండెపోటు వచ్చినా బస్సును రోడ్డు మీదే ఆపడంతో.. విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే డ్రైవర్‌ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Also Read: IndiGo Flight: విమానం గాల్లో ఉండగానే ఎమర్జెన్సీ డోర్‌ తెరిచేందుకు యత్నం.. భయాందోళనలకు గురైన ప్రయాణికులు!

అద్దంకి పట్టణానికి చెందిన ఓ ప్రైవేటు స్కూల్‌ బస్సు డ్రైవర్‌ గుర్రాల ఏడుకొండలు (53) మైలవరం, ఉప్పలపాడు, వెంపరాల గ్రామాల నుంచి 40 మంది విద్యార్థులను పాఠశాలకు ఈరోజు ఉదయం తీసుకెళుతున్నాడు. బస్సు ఉప్పలపాడు దాటిన తర్వాత డ్రైవర్ ఏడుకొండలుకు గుండెపోటు రావడంతో అతడు సీట్లోనే కుప్పకూలాడు. స్కూల్ బస్సు రోడ్డు మధ్యలో ఆగిపోవడంతో స్థానికులు గమనించి డ్రైవర్‌ను కిందికి దించి పరిశీలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందాడు. స్కూల్ యాజమాన్యం, పోలీసులు వచ్చి ఘటనాస్థలిని పరిశీలించారు. విద్యార్థులను అదే బస్సులో మరో డ్రైవర్‌ సహాయంతో అద్దంకికి తీసుకెళ్లారు.

Exit mobile version