Visakha Drinking Water: విశాఖ నగరానికి మంచినీటి ముప్పు!
- విశాఖలో వాటర్ సప్లై కార్మికులు సమ్మె
- నానా అవస్థలకు గురవుతున్న విశాఖ నగర వాసులు
- మేయర్ సమక్షంలో జరిగిన చర్చలు విఫలం
- ఇవాళ మరోసారి చర్చలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) వాటర్ సప్లై కార్మికులు సమ్మె చేపట్టడంతో.. విశాఖ నగర వాసులు నానా అవస్థలకు గురవుతున్నారు. కార్మికుల నిరవధిక సమ్మె కారణంగా జీవీఎంసీ పరిధిలోని 98 వార్డులతో పాటు పరిశ్రమలకు తాగునీరు పూర్తిగా నిలిచిపోయింది. పంపింగ్ నుంచి డిస్ట్రిబ్యూషన్ వరకు కార్మికులు విధుల బహిష్కరించి.. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్ల పరిష్కారంలో అధికారులు, మేయర్ ఆసక్తి చూపకపోవడంతో ఈ సమ్మెకు దిగినట్లు కార్మికులు తెలిపారు.
జీవీఎంసీ వాటర్ సప్లై కాంట్రాక్టు కార్మికుల నిరవధిక సమ్మె కారణంగా విశాఖలోని మూడు లక్షల ఇంటి కులాయిలు సహా పలు కీలక పరిశ్రమలకు మంచినీటి సరఫరా నిలిచిపోయింది. దాదాపు 30 గంటలుగా పంపింగ్ ప్రక్రియ స్థంభించిపోవడంతో పలు కాలనీల ప్రజలు మంచినీటి కోసం తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఏలేరు, తాటిపూడి, గోస్తని, గంభీరం, రైవాడ కెనాల్స్ నుంచి వచ్చే నీటిని కార్మికులు నిలిపివేశారు. దాంతో ఇప్పటికే జీవీఎంసీ పరిధిలో ఉన్న అన్ని ట్యాంకులు ఖాళీ అయ్యాయి. తిరిగి ట్యాంకులను నింపాలంటే సుమారు 10 గంటలు సమయం పడుతుంది.
Also Read
- Pune Trekker Case: హత్యకు 4 రోజుల ముందే ‘స్నేక్’ డ్రామా.. పూణెలో సోనమ్ వారసురాలు ఏం మర్డర్ ప్లాన్
- Bharat tiwari: బీహార్‌ను కుదిపేస్తున్న భరత్ తివారీ ఎన్కౌంటర్.. పోలీసులపై ఎఫ్ఐఆర్.
- Deepam Row: తిరుప్పరంకుండ్రం దీపం వివాదం.. సుప్రీంకోర్టుకు విజయ్ సర్కార్..
- Padma Awards: 65 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు అందజేత.. మమ్ముట్టి, మాధవన్‌కు గౌరవం
Also Read: Shefali Jariwala: ‘కాంటా లగా’ ఫేమ్ షఫాలీ జరివాలా మృతి!
జీవీఎంసీ వాటర్ సప్లై కాంట్రాక్టు కార్మికుల సమ్మె రెండో రోజుకు చేరింది. మేయర్ పీలా శ్రీనివాసరావు సమక్షంలో జరిగిన చర్చలు విఫలం అయ్యాయి. ఇవాళ మరోసారి మేయర్ చర్చలకు పిలిచారు. ఒకవేళ డిమాండ్లు నెరవేర్చకుంటే కార్మికులు సమ్మెను కొనసాగించనున్నారు. ఇదే జరిగితే నగర వాసులకు సమస్యలు తప్పవని వాటర్ సప్లై ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే మంచినీరు రాకపోవడంతో వేరే గత్యంతరం లేక బోరింగ్ల వద్ద క్యూలు కడుతున్నారు. అవి కూడా బురద రంగులో వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అజనాలు కోరుతున్నారు.
తాజావార్తలు
-
Pune Trekker Case: హత్యకు 4 రోజుల ముందే ‘స్నేక్’ డ్రామా.. పూణెలో సోనమ్ వారసురాలు ఏం మర్డర్ ప్లాన్
-
Padma Awards: దిగ్గజాలకు పద్మ పురస్కారాలు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డుల ప్రదానం!
-
Sanjeev Bikhchandani: ఒక్క నిర్ణయం.. వేల కోట్ల సామ్రాజ్యం! నౌక్రీ.కామ్ బాస్ ఇన్వెస్ట్మెంట్ మ్యాజిక్ చూశారా?
-
Vijay – Trisha Breakup; ఒక్క పోస్టుతో అందరి నోళ్ళు మూయించిన త్రిష
-
Bharat tiwari: బీహార్‌ను కుదిపేస్తున్న భరత్ తివారీ ఎన్కౌంటర్.. పోలీసులపై ఎఫ్ఐఆర్.
ట్రెండింగ్
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!
-
MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో నేడు ప్రత్యేకమైన రోజు.. ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ చరిత్ర!
-
11,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, IP69K రేటింగ్ ప్రత్యేకతలతో HONOR X80 Pro Max లాంచ్.! ధర ఎంతంటే.?