సృష్టి సరోగసి అక్రమాల కేసులో ఏ1గా ఉన్న ఉన్న డాక్టర్ నమ్రత 5 రోజుల కస్టడీ విచారణ ముగిసింది. గాంధీ ఆసుపత్రిలో డాక్టర్ నమ్రతకు వైద్య పరీక్షల కోసం నార్త్ జోన్ డీసీపీ ఆఫీస్ నుంచి తరలించారు. వైద్య పరీక్షలు అనంతరం సికింద్రాబాద్ కోర్టులో డాక్టర్ నమ్రతను హాజరు పర్చనున్నారు. కస్టడీలో భాగంగా పలు అంశాలపై డాక్టర్ నమ్రతాను పోలీసులు విచారించారు. కస్టడీలో డాక్టర్ నమ్రతా ఆకృత్యాలు వెలుగు చూశాయి. ఆధారాలు ముందు ఉంచి విచారించారు పోలీసులు.. చైల్డ్ ట్రాఫికింగ్ తో పాటు సరోగసి మోసాలపై ఆరా తీశారు.. చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాలతో డాక్టర్ నమ్రతాకు సంబంధాలు ఉన్నట్టు గుర్తించారు. కళ్యాణితో కలిసి ఏజెంట్లు సహకారంతో చైల్డ్ ట్రాఫికింగ్ చేసినట్టు నిర్ధారణ అయ్యింది.. కస్టడీ విచారణలో భాగంగా ఏజెంట్ల నెట్వర్క్ ను గుర్తించారు. రేపటితో కళ్యాణి, దనశ్రీ సంతోషి విచారణ సైతం ముగియనుంది.
READ MORE: Screenshot History: స్క్రీన్‌షాట్ ఫీచర్‌ను ఎవరు కనుగొన్నారో తెలుసా..? ఆసక్తికర విషయాలు…
