SteppaMaar Song Gets Record Views: హీరో రామ్ పోతినేని, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందిన హిట్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’. 2019లో వచ్చిన ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ తెరకెక్కుతోంది. ఇందులో రామ్ సరసన కావ్య థాపర్ నటిస్తుండగా.. సంజయ్ దత్, అలీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పూరి జగన్నాధ్, ఛార్మీ కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలెట్టింది.
డబుల్ ఇస్మార్ట్ నుంచి ‘స్టెప్పామార్..’ అనే పాట లిరికల్ వీడియోను చిత్ర బృందం సోమవారం రిలీజ్ చేసింది. ‘ఇస్మార్ట్ శంకరే.. ఏక్ దమ్ డేంజరే.. ఔర్ ఏక్ బార్ ఆయారే.. బేజారే..’ అంటూ సాంగ్ సాగుతోంది. ఈ సాంగ్ యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది. 15 గంటల్లో 1535673 వ్యూస్ వచ్చాయి. ‘సూపర్ మాస్ సాంగ్’, ‘ఈ ఏడాదికే హైలెట్ మాస్ సాంగ్’ అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఈ పాటకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ స్వరాలు సమకూర్చారు. మణిశర్మ అందించిన మ్యూజిక్‌కు ఫాన్స్ ఫిదా అవుతున్నారు.
Also Read: Badminton Player Death: పెను విషాదం.. గుండెపోటుతో కోర్టులోనే కుప్పకూలిన 17 ఏళ్ల ప్లేయర్!
స్టెప్పామార్ పాటకి భాస్కర భట్ల సాహిత్యమందించగా.. అనురాగ్ కులకర్ణి ఆలపించారు. జానీ మాస్టర్ కోరియోగ్రఫీ చేశారు. ఈ పాటలో మాస్ స్టైలిష్ లుక్‌లో రామ్ పోతినేని కనిపించిన తీరు.. ఆయన వేసిన హుషారైన స్టెప్పులు ఆకర్షణగా నిలిచాయి. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఈ మాస్ సాంగ్ హైలెట్ కానుంది.