టాలీవుడ్ ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని ,డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఏ రేంజ్‌లో బాక్సాఫీస్‌ను షేక్ చేసిందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ చాట్ బస్టర్ సాంగ్స్ అందించాడు. ఇప్పుడు ఈ ముగ్గురి క్రేజీ కాంబినేషన్ లో ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ తో మరోసారి బాక్సాఫీస్ దుమ్ము లేపేందుకు వారు సిద్ధం అవుతున్నారు.. ఇప్పటికే డబుల్ ఇస్మార్ట్ టీం రిలీజ్ చేస్తున్న వరుస అప్డేట్స్ మూవీ లవర్స్ కు సినిమాపై మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయి..తాజాగా డబుల్ ఇస్మార్ట్ ఆల్బమ్ అప్‌డేట్ వచ్చింది. ఈ మూవీ ఆడియో రైట్స్‌ను పాపులర్ మ్యూజిక్ లేబుల్ ఆదిత్య మ్యూజిక్ దక్కించుకుంది. ఈ విషయాన్ని షేర్ చేయడంతో.. మరో అదిరిపోయే ఆల్బమ్ రెడీ అవుతోందంటూ చర్చించుకుంటున్నారు సినీ జనాలు.
పూరీ కనెక్ట్స్ బ్యానర్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో రామ్ స్టైలిష్ గాగుల్స్ పెట్టుకొని గన్స్ మధ్య స్టైలిష్‌గా ఉన్న డబుల్ ఇస్మార్ట్ లుక్‌ను విడుదల చేయగా.. ఇప్పటికే నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మరోవైపు రామ్ సెట్స్‌లో గుబురు గడ్డంతో ఉన్న హాఫ్ లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.డబుల్ ఇస్మార్ట్‌లో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నాడు. ఫస్ట్ పార్టుకు అదిరిపోయే మ్యూజిక్ మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించిన మణిశర్మ సీక్వెల్‌కు కూడా పనిచేస్తుండటంతో సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ అవుతోంది. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళ భాషల్లో మార్చి 8న గ్రాండ్ విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే తెలియజేశారు మేకర్స్. ఇస్మార్ట్ ఈజ్ బ్యాక్.. ఈ సారి డబుల్ ఇంపాక్ట్.. అంటూ శక్తిమంతమైన త్రిశూలం.. బ్యాక్ డ్రాప్‌లో మంటలు కనిపిస్తున్న స్టిల్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేస్తుంది. రామ్ దీంతోపాటు పాపులర్ బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో కూడా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
Get ready for a musical blast that will set your charts on fire🔥
The chartbuster combo of Ustaad @ramsayz, Dir #PuriJagannadh & #ManiSharma highly anticipated #DoubleISMART Audio rights bagged by renowned @adityamusic❤️🔥@duttsanjay @Charmmeofficial @IamVishuReddy… pic.twitter.com/cZdX8R8IQm
— Puri Connects (@PuriConnects) January 24, 2024