2024 జనవరి 5న థియేటర్లలో రిలీజ్ అయిన డబల్ ఇంజన్ మార్చి 29 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. సినిమాల కంటే బయట అనేక వివాదాలతో బాగా ఫేమస్ అయిన గాయత్రి గుప్తా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో భాగంగా ఈ సినిమా తెరకెక్కించారు. రోహిత్ పెనుమాత్స ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. శశి, రోహిత్ లి కథనం పొందుపరిచారు.
Also Read: Disha Patani: హీట్ సమ్మర్ లో హాటెస్ట్ అందాలు ఆరబోస్తున్న దిశా పటాని..
కేవలం 12 రోజుల్లోనే 30 లక్షల బడ్జెట్ తో ప్రయోగాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో గాయత్రి గుప్తా, అజిత్ కుమార్, రోహిత్ నరసింహ, ముని, రాజు లు ప్రధాన పాత్రలు పోషించారు. ముఖ్యంగా ఈ సినిమా తెలంగాణ యాసతో రియల్ ఎస్టేట్ గా రూపొందించారు. ఇక ఈ సినిమాను రెండు తలల పామును పట్టుకొని భారీగా డబ్బు సంపాదించాలన్న బ్యాక్ డ్రాప్ కథతో సినిమాను తెరకెక్కించారు.
ఈ సినిమా జనవరి 5, 2024 అతి తక్కువ థియేటర్స్ లో రిలీజ్ అయినప్పటికీ ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. అదేరోజున అనేక సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ కావడంతో ఈ సినిమా థియేటర్లోకి వచ్చి పోయినట్లు కూడా చాలామందికి తెలియదు.