Double Decker Bus: ఇంగ్లండ్‌లోని గ్రేటర్ మాంచెస్టర్ శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సాల్ఫోర్డ్ (Salford) ప్రాంతంలోని బార్టన్ రోడ్ (Barton Road), ట్రాఫర్డ్ రోడ్ (Trafford Road) కలిసే ప్రాంతంలో ఒక డబుల్ డెక్కర్ బస్సు బ్రిడ్జ్ ను ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం సమయంలో (అక్కడి సమయమానం ప్రకారం) జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసుల ప్రకారం.. బస్సు బ్రిడ్జిని ఢీకొన్నప్పుడు బస్సు పై అంతస్తు పైభాగం పూర్తిగా దెబ్బతినదని వెల్లడించారు. ఈ దుర్ఘటనలో 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
Varun Sandesh: బర్త్‌డే స్పెషల్.. భర్త పుట్టినరోజుకి వితికా ఇచ్చిన భారీ సర్ప్రైజ్ మాములుగా లేదుగా..!
అలాగే నార్త్ వెస్ట్ అంబులెన్స్ సర్వీస్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాద స్థలానికి వెంటనే 10 అంబులెన్సులు, హజార్డు రెస్పాన్స్ టీం, ఎయిర్ అంబులెన్స్ సహా పెద్ద సంఖ్యలో పారామెడిక్స్ చేరుకున్నారని.. అక్కడ గాయపడినవారిని సాల్ఫోర్డ్ రాయల్, మాంచెస్టర్ రాయల్ ఇన్‌ఫర్మరీ హాస్పిటళ్లకు తరలించినట్లు తెలిపారు. ప్రమాద సమయంలో ఈ బస్సు “100 సర్వీస్”గా ట్రాన్స్‌పోర్ట్ ఫర్ గ్రేటర్ మాంచెస్టర్ (TfGM) కార్యాలయానికి చెందినదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి.
ఘటన సమయంలో సమీపంలో ఉన్న స్టేసీ మోర్లీ అనే మహిళ మాట్లాడుతూ.. ఇదే బ్రిడ్జ్ వద్ద నాలుగో సారి బస్సు ఢీకొనడం చూస్తున్నానని తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో ప్రస్తుతం ఘటనాస్థలిలో రహదారి మూసివేయగా, పోలీసులు ప్రజలను ఆ ప్రాంతం వైపు రాకుండా ఉండాలని సూచించారు. సంబంధిత అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.
🚨 UK BUS HORROR: Top RIPPED OFF after driver slams into low bridge
A double-decker bus collided with a low bridge, nearly decapitating passengers as the entire upper deck was sheared off. 20 people injured — several with serious head trauma.
👮 Driver ARRESTED for careless… pic.twitter.com/XRKWNo0wa2
— Sarcasm Scoop (@sarcasm_scoop) July 22, 2025
⚠️Graphic Warning⚠️
The 100 bus which collided with a bridge in #Eccles has been removed.
Emergency services, including air ambulances, rushed to #BartonRoad at around 3pm.
15 people are in hospital being treated for their injuries. pic.twitter.com/fbqUI5WQLJ
— Hits Radio News | Manchester (@hitsmcrnews) July 21, 2025