DOST 2022 First Phase Admissions Today
తెలంగాణలోని డిగ్రీ కళాశాలలోని సీట్ల భర్తీ ఇటీవల విద్యాశాఖ డిగ్రీ ఆన్లైన్ సర్వీసస్ తెలంగాణ( దోస్త్) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. నేడు డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి దోస్త్ తొలి విడత సీట్లను కేటాయించనున్నారు. రేపటి నుంచి ఈనెల 18 వరకు ప్రవేశ ప్రక్రియ నిర్వహించనున్నారు అధికారులు. 4,68,880 సీట్ల భర్తీకి విద్యామండలి కసరత్తు చేస్తోంది. అక్టోబర్ 1 నుంచి తరగతులు ప్రారంభించే అవకాశం ఉంది. అయితే రాష్ట్రంలోని కాకతీయ, ఉస్మానియా, శాతవాహన, తెలంగాణ, మహాత్మగాంధీ, పాలమూరు విశ్వవిద్యాలయాల పరిధిలోని 1,060 కాలేజీల్లో డిగ్రీ కోర్సుల్లో సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అయితే.. బీఏ, బీఎస్సీ, బీకాం, బీకాం వొకేషనల్, బీకాం ఆనర్స్, బీఎస్‌డబ్ల్యూ, బీబీఏ, బీబీఎం, బీసీఏతో పాటు ఇతర కోర్సుల్లో దోస్త్ ద్వారా ప్రవేశాలు కల్పించనున్నారు అధికారులు.
మూడు లేదా నాలుగు విడతల్లో డిగ్రీ సీట్లను భర్తీ చేయడానికి సన్నాహాలు చేస్తోంది తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్. అయితే.. విద్యార్థి సీటు కేటాయింపుతో సంతృప్తి చెందితే, కళాశాల ఫీజు లేదా సీటు రిజర్వేషన్ ఫీజును ఆన్‌లైన్ ద్వారా రేపటి నుంచి 18వ తేదీ మధ్య చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత విద్యార్థి తాను సెలెక్ట్ చేసుకున్న కళాశాలను సందర్శించి ప్రవేశ ప్రక్రియను పూర్తి చేయడానికి అవసరమైన ధృవీకరణ పత్రాలను సంబంధిత కళశాలలో సమర్పించాల్సి ఉంటుంది.