CMR Trolls: సిఎంఆర్ పై సోషల్ మీడియాలో ట్రోలవుతున్న ప్రచారాన్ని నమ్మొద్దు
- సిఎంఆర్ పై సోషల్ మీడియాలో ట్రోలవుతున్న ప్రచారాన్ని నమ్మొద్దు.
- ది వైజాగ్ పటం క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రెస్ మీట్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CMR Trolls: సిఎంఆర్ షాపింగ్ మాల్ పై సోషల్ మీడియాలో జరుగుతున్న నకిలీ, మార్ఫింగ్ చేసిన పోస్టు దుష్ప్రచారాన్ని మేము ఖండిస్తున్నామని.. సిఎంఆర్ షాపింగ్ మాల్ గత 4 దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాలలో సుపరిచితమైన బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుని వేడుక ఏదైనా సిఎంఆర్ తోనే శుభారంభం అనే నానుడితో ప్రతి ఇంటా చెరగని ముద్రవేసిన సంస్థగా గుర్తింపు తెచ్చుకుందని, ఇటీవలి కాలంలో కొంతమంది పోటీదారులు సిఎంఆర్ ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశ్యంతో కావాలనే బ్రాండ్ లోగోను ఒక సోషల్ మీడియా పోస్టులో మార్ఫింగ్ చేసి సిఎంఆర్ షాపింగ్ మాల్ కు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తున్నారని.. దీనిని పూర్తిగా ఖండిస్తున్నామని, ప్రజలందరూ దీనిని గమనించాలని ఏదైనా ఫేక్ పోస్టు చేసినపుడు అది అవునా కాదా అని నిర్ధారణ చేసుకుని పోస్టులు చేయాలని.. దీనివలన ప్రజలలో మంచి గుర్తింపు ఉన్న సంస్థలపై వ్యతిరేక భావం కలుగుతుందని, దీనిని పూర్తిగా ఖండిస్తున్నామన్నారు ది వైజాగ్ పటం క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కంకటాల మల్లిక్.
ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న పోస్టును తగినటువంటి ఆధారాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో సైబర్ క్రైమ్ పోలీసులు మా స్టోరు ఉన్న ప్రతి పోలీసు స్టేషన్లో పైన తెలిపిన పోస్టు దుష్ప్రచారానికి బాధ్యులైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవలసినదిగా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయటం జరిగినదని, కావున సిఎంఆర్ షాపింగ్ మాల్ పై ఇటువంటి దుష్ప్రచారాన్ని తెలిసీ తెలియక మరెవరికైనా పైన తెలిపిన పోస్టును ఫార్వార్డ్ చేస్తే సైబర్ క్రైమ్ చట్టరీత్యా తగు చర్యలు తీసుకొనబడునని సిఎంఆర్ ఫౌండర్ & చైర్మన్ మావూరి వెంకటరమణ ది వైజాగ్ పటం క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రెస్ మీట్ లో తెలిపారు.
Also Read
- Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
- Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్‌గాంధీ విమర్శలు
- IND vs WI 2026: మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 27 నుంచే..
- Faaah : 'ఫాహ్..' వైరల్ సౌండ్ వెనుక ఉన్నది టాలీవుడ్ లెజెండరీ కమెడియనా?.. అసలు నిజం ఇదిగో!
సిఎంఆర్ అంటే ప్రజలలో ఒక నమ్మకం కలిగిన సంస్థ. సిఎంఆర్ తన వ్యాపార రంగంలోనే కాకుండా సేవా కార్యక్రమాలలో ఎప్పుడూ ముందుండే సంస్థ. దీనిపై ఇటువంటి తప్పుడు పోస్టులు ఎవరైనా పోస్ట్ చేసినపుడు ప్రజలందరూ దీనిని గమనించాలని.. ఏదైనా ఫేక్ పోస్టు చేసినపుడు.. అది అవునా కాదా అని నిర్ధారణ చేసుకుని పోస్టులు చేయాలని దీనివలన ప్రజలలో మంచి గుర్తింపు ఉన్న సంస్థలపై వ్యతిరేక భావం కలుగుతుందని, దీనిని పూర్తిగా ఖండిస్తునట్లు ది వైజాగ్ పటం క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ చైర్మన్ మురళీకృష్ణ.
సిఎంఆర్ సంస్థల మీద సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం జరుగుతుంది. మతపరమైన అంశాల్ని జోడించి ఫేక్ పోస్టులతో ప్రచారం చేస్తున్నారు. అలాంటి పోస్టర్ని ఎప్పుడు సిఎంఆర్ కూడా ముద్రించలేదు. ఈ విషయాన్ని గమనించాలి. దీనిని పూర్తిగా ఖండిస్తున్నామన్నారు ది వైజాగ్ పటం క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుదర్శన్ స్వామి. సిఎంఆర్ సంస్థల మీద సోషల్ మీడియా వేదికగా, దుష్ప్రచారం జరుగుతున్న విషయాలను గమనించి ఇటువంటి ఫేక్ పోస్టులను ఫార్వార్డ్ చేయవద్దని కోరుతున్నామని, దీనిపై ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయటం జరిగినదని, విచారణ జరుగుతుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ పూర్వపు ప్రెసిడెంట్ (స్టేట్) పైడా కృష్ణ ప్రసాద్ అన్నారు.
తాజావార్తలు
-
Alprazolam Seizure : సైబరాబాద్‌లో భారీగా అల్ఫాజోలం పట్టివేత.. నలుగురు అరెస్ట్
-
Begumpet Cab Driver Murder: క్యాబ్ కోసం.. డ్రైవర్‌ను చంపేశారు
-
Nayanthara : మహాశక్తి’తో కంబ్యాక్ ఇస్తుందా?
-
Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
-
Ramayana : ‘జై జై రామ్’ పాట.. ఎందుకిలా చేస్తున్నారు?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?