Trump T1 Mobile: 50MP కెమెరా, AI ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌తో.. డోనాల్డ్ ట్రంప్ స్మార్ట్‌ఫోన్ విడుదల.. ధర ఎంతంటే?
- డోనాల్డ్ ట్రంప్ స్మార్ట్‌ఫోన్ విడుదల
- 50MP కెమెరా, AI ఫేస్ అన్‌లాక్ ఫీచర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెలికమ్యూనికేషన్ వ్యాపారంలోకి ప్రవేశించారు. ఆయన తాజా కంపెనీ ట్రంప్ మొబైల్ T1 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ అమెరికాలో ఉత్పత్తి అవుతుంది. వార్తా సంస్థ రాయిటర్స్ ప్రకారం, ఆయన దేశీయ కస్టమర్ సపోర్ట్ సెంటర్‌ను కూడా ప్రారంభించారు. డోనాల్డ్ ట్రంప్ జూనియర్, ఎరిక్ ట్రంప్ న్యూయార్క్‌లోని ట్రంప్ టవర్‌లో ఈ కొత్త కంపెనీని ప్రారంభించారు. ట్రంప్‌కు చెందిన ఈ కంపెనీ అమెరికాలో ప్రధాన టెలికాం ఆపరేటర్‌గా పనిచేస్తుంది. ట్రంప్ టెలికాం కంపెనీ మొబైల్ వర్చువల్ నెట్‌వర్క్ ఆపరేటర్‌గా పని చేస్తుంది. ఇది మూడు ప్రధాన అమెరికన్ వైర్‌లెస్ సర్వీస్ ప్రొవైడర్ల నుంచి నెట్‌వర్క్ సామర్థ్యాన్ని కొనుగోలు చేస్తుంది.
Also Read:Trump: జీ7 నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయిన ట్రంప్.. ఆగమేఘాలపై అమెరికాకు పయనం
Also Read
- Heavy Rain Alert: ఏపీ వాసులకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- FIFA World Cup 2026: 'ఉండావ్' డబుల్ ధమాకా.. ఐవరీ కోస్ట్‌పై జర్మనీ అద్భుత విజయం.. ప్రీక్వార్టర్స్‌లోకి అడుగు.!
- International Yoga Day: 12 ఏళ్లు పూర్తి.. అసలు జూన్ 21నే యోగా డే ఎందుకు జరుపుకుంటారు? చరిత్ర ఇదే!
- CM Chandrababu Naidu: యోగాతో హెల్తీ, వెల్తీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం.!
ట్రంప్ T1 ఫోన్ ధర, ఫీచర్లు
డోనాల్డ్ ట్రంప్ కంపెనీ ట్రంప్ మొబైల్ స్మార్ట్‌ఫోన్ T1 ఫోన్‌ను విడుదల చేసింది. ఈ గోల్డ్ కలర్ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌పై పనిచేస్తుంది. దీని ధర $499 (సుమారు రూ. 42,893). ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆగస్టు నుండి $100 డౌన్‌పేమెంట్‌తో కొనుగోలు చేయవచ్చు.ట్రంప్ మొబైల్ యొక్క T1 ఫోన్ డిస్ప్లే 6.8-అంగుళాలు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే AMOLED ప్యానెల్. ఈ ఫోన్ ప్రాథమిక కెమెరా 50MP, దీనితో 2MP డెప్త్, 2MP మాక్రో కెమెరా సెన్సార్ అందించారు. ఈ ఫోన్‌లో 16MP సెల్ఫీ కెమెరా ఉంది. ఫోన్‌లో 5000mAh బ్యాటరీ అందుబాటులో ఉంటుంది. ట్రంప్ మొబైల్ మొదటి ఫోన్ ఆండ్రాయిడ్ 15 పై రన్ అవుతుంది. ఈ ఫోన్ 12GB RAM, 256GB విస్తరించదగిన స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ భద్రత కోసం ఫింగర్ ప్రింట్ స్కానర్, AI ఫేస్ అన్‌లాక్‌కు సపోర్ట్ చేస్తుంది.
Also Read:Kaleshwaram Commission : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై కాళేశ్వరం కమిషన్ సీరియస్
అమెరికాలో తయారైన స్మార్ట్‌ఫోన్
ట్రంప్ మొబైల్ తన మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ T1 ఫోన్‌ను ‘డిజైన్డ్ అండ్ బిల్ట్ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్’ అనే ట్యాగ్‌తో మార్కెట్ చేస్తోంది. ఈ ఫోన్ ద్వారా, విదేశీ బ్రాండ్‌లకు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న వారిని లక్ష్యంగా చేసుకోవాలని కంపెనీ భావిస్తోంది. ప్రతి సంవత్సరం USలో 60 మిలియన్ల స్మార్ట్‌ఫోన్‌లు సేల్ అవుతున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లన్నీ US వెలుపల తయారు చేయారవడం గమనార్హం. డోనాల్డ్ ట్రంప్ ‘ది 47 ప్లాన్’ అపరిమిత కాలింగ్, టెక్స్ట్, డేటా, ఉచిత అంతర్జాతీయ కాలింగ్‌ను అందిస్తుంది.
Also Read:Kuberaa Censor : ‘కుబేర’ సెన్సార్. ధనుష్ ఫ్యాన్స్ నజర్.. ఎందుకంటే.?
ఈ సర్వీస్ ప్లాన్ నెలకు $47.45 (సుమారు రూ. 4,0787) ఖర్చవుతుంది. ఇది ట్రంప్‌ను 47వ అధ్యక్షుడిగా సూచిస్తుంది. ఈ ప్రణాళికతో, వినియోగదారులు అపరిమిత కాలింగ్, టెక్స్ట్, డేటా వంటి ప్రయోజనాలను పొందుతారు. దీనితో పాటు, ట్రంప్ కంపెనీ 100 కంటే ఎక్కువ దేశాలలో వినియోగదారులకు 24/7 రోడ్‌సైడ్ సహాయం, టెలిహెల్త్ సేవ, పరికర రక్షణ, ఉచిత అంతర్జాతీయ కాలింగ్‌ను కూడా అందిస్తుంది.
తాజావార్తలు
-
RC 17 : రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ఇప్పట్లో సెట్స్ పైకి వెళ్లదా?
-
Nurse Transfer Request: మంత్రి కాళ్లపై పడి కన్నీరు పెట్టుకున్న నర్సు.. కారణం ఏంటంటే?
-
Heavy Rain Alert: ఏపీ వాసులకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
-
Dhanush OM : కర ప్లాప్ తర్వాత కెరీర్లో బిగ్ రిస్క్ చేస్తున్న ధనుష్
-
Manoj Bajpayee : చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం లేదు.. మనోజ్ బాజ్‌పాయ్ ఆవేదన
ట్రెండింగ్
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్‌కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్‌గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్‌ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!