Donald Trump: సహకరించని నాటో దేశాలపై ట్రంప్ ఫైర్.. మేము దీన్ని గుర్తుంచుకుంటామంటూ హెచ్చరిక
- సహకరించని నాటో దేశాలపై ట్రంప్ ఫైర్
- నాటోను "cowards" (పిరికివాళ్లు) అని, "paper tiger" అని విమర్శించారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో జరుగుతున్న ఉద్రిక్తతల మధ్య స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ (హోర్ముజ్ జలసంధి) ను తిరిగి తెరవడానికి, రక్షించడానికి నాటో మిత్రదేశాలు, ఇతర మిత్రపక్షాల నుంచి సైనిక సహాయం (వార్‌షిప్‌లు పంపడం) కోరారు. కానీ చాలా దేశాలు (యూకే, ఆస్ట్రేలియా, జపాన్ వంటివి సహా) నిరాకరించాయి లేదా మద్దతు ఇవ్వలేదు. దీంతో ట్రంప్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. నాటోను “cowards” (పిరికివాళ్లు) అని, “paper tiger” అని విమర్శించారు. ముఖ్యంగా “We will remember this” (మేము దీన్ని గుర్తుంచుకుంటాము) అని హెచ్చరించారు.
Also Read:Crime News: తొందరపడి నిర్ణయాలు.. గాల్లో కలిసిపోతున్న ప్రాణాలు..!
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
ఇది నాటో భవిష్యత్తుకు “very bad” అవుతుందని, అమెరికాకు సాయం చేయకపోతే దాని పరిణామాలు ఉంటాయని మండిపడ్డారు. ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’లో ఒక పోస్ట్ పెట్టి, నాటో మిత్రదేశాలను విమర్శించారు. అణ్వాయుధాలు కలిగిన ఇరాన్‌ను అడ్డుకునే పోరాటంలో నాటో దేశాలు జోక్యం చేసుకోవడానికి ఇష్టపడటం లేదని ట్రంప్ అన్నారు.హోర్ముజ్ జలసంధిని తెరవడానికి నాటో దేశాలు సహకరించడానికి సుముఖంగా లేవని అమెరికా అధ్యక్షుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని ఒక సాధారణ సైనిక చర్యగా అభివర్ణిస్తూ, హోర్ముజ్ జలసంధిని మూసివేయడమే అధిక చమురు ధరలకు ఏకైక కారణమని ట్రంప్ అన్నారు.
Also Read:Hyundai Exter: మిడిల్ క్లాస్ ఫేవరెట్.. సన్‌రూఫ్, డాష్‌క్యామ్‌తో హ్యుందాయ్ ఎక్స్టర్ విడుదల
నాటో అనేది 1949లో ఏర్పడిన ఒక సైనిక కూటమి. ఇందులో యునైటెడ్ స్టేట్స్, కెనడా అనేక ఐరోపా దేశాలు ఉన్నాయి. దీని ముఖ్య ఉద్దేశ్యం సామూహిక రక్షణ. ఒక నాటో సభ్య దేశంపై దాడిని అందరిపై దాడిగా పరిగణిస్తారు. ప్రస్తుతం, నాటోలో భద్రత, సహకారం కోసం కలిసి పనిచేసే 30కి పైగా దేశాలు ఉన్నాయి. హోర్ముజ్ జలసంధిలో ప్రస్తుత పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా ఉంది. ఇరాన్ మార్చి 4న జలసంధిని మూసివేసింది. దాని గుండా ప్రయాణించవద్దని నౌకలను ఇరాన్ హెచ్చరించింది. తొలి రోజుల్లో, జలసంధి గుండా ప్రయాణించిన నౌకలపై దాడులు జరిగాయి. తాము సముద్రంలో మందుపాతరలు అమర్చి, రాకపోకలను నిరోధించామని ఇరాన్ పేర్కొంది.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!