Site icon NTV Telugu

Vijayawada: భర్త కొడుతున్నాడని 112 కు ఫోన్ చేసిన మహిళ… చివరికీ..

Domestic Abuse

Domestic Abuse

భర్త దౌర్జన్యకాండతో విసిగి పోయానని ఇంట్లో అన్ని వస్తువులు ధ్వంసం చేశాడని, తనను రక్షించాలని ప్రాథేయపడుతూ ఈనెల ఎనిమిదో తేదీన పూర్ణానందం పేటకి చెందిన ఓ బాధితురాలు 112 కి ఫోన్ చేసింది. ఆ కాల్ రిసీవ్ చేసుకున్న 112 సిబ్బంది, సమాచారం సేకరించి సత్యనారాయణపురం నుంచి ఓ పోలీస్ కానిస్టేబుల్, ఒక హోంగార్డు సంఘటన స్థలానికి పంపింది. బాధితురాలు తన ఇంట్లో వస్తువులు ధ్వంసం చేసిన తీరును పోలీసులకు క్షుణ్ణంగా వివరించింది. తనను రక్షించాలని తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో పోలీసుల భర్తను స్టేషన్‌కు పిలిపించారు.

READ MORE: Israel Iran War: ట్రంప్ ‘‘అగ్నికి ఆజ్యం పోస్తున్నాడు’’.. ఇజ్రాయిల్-ఇరాన్ వార్‌పై చైనా విమర్శలు..

భార్యపై దౌర్జన్యం చేయడం సరికాదు.. ఎందుకు వస్తువులు ధ్వంసం చేశారు? అని భర్తను పోలీసులు ప్రశ్నించారు.. దీంతో ఆయన ఒక్కసారిగా ఊగిపోయాడు. అతడిని శాంతింపజేయడానికి తల్లిని స్టేషన్‌కు పిలిపించారు. స్టేషన్లో ఇలా ప్రవర్తించడం సరికాదని తన కుమారుడికి ఆమె నచ్చజేప్పే ప్రయత్నం చేసింది.. ఆమెపై కూడా ఆ వ్యక్తి విరుచుకుపడ్డాడు. దీంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. భర్త ప్రవర్తనను ప్రత్యేక్షంగా చూసిన పోలీసులు భార్యను వేధింపులకు గురి చేశాడని భావించారు. బాధిత మహిళ కుటుంబ సభ్యులంతా ఉన్నత విద్యావంతులే. ఆమె బంధువుల్లో ఒకరు ప్రభుత్వ న్యాయవాదిగా విధులు నిర్వహిస్తూ ఎంతో మంది మహిళలకు సహాయం చేస్తున్నారు.

READ MORE: HONDA CBR 650R: మార్కెట్లోకి కొత్త హోండా బైక్.. గేర్లు మార్చేందుకు క్లచ్ నొక్కనవసరం లేదు గురూ..

ఇక్కడ పోలీసులు భర్త వృత్తి వివరాలు సేకరించక ముందే సంఘటన ప్రాంతంలో ధ్వంసం చేసిన తీరుతో ముందుగా భార్యను కాపాడాలనే ఆలోచన చేశారు. ఆ భర్తకి చెందిన పూర్తి వివరాలు మాత్రం తెలుసుకోలేదు. అయితే, ఘటన వెనుక ఉన్న వాస్తవాలు, భర్త వృత్తి, కుటుంబ పరిస్థితులు తదితర అంశాలను పూర్తిగా తెలుసుకుని, సమగ్ర దర్యాప్తుతో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే.. ఈ ఘటనలో కొన్ని సంఘటనలు వాస్తవ విషయాలు వెలుగులోకి రాకుండా.. కొంతమంది వాటిని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తుంటారని తెలుస్తోంది. ఇప్పుడు ఆ బాధిత మహిళకు న్యాయం జరుగుతుందా లేక కొందరు ఈ ఘటనను పక్కదారి పట్టిస్తారా? అనేది తెలియాల్సి ఉంది.

Exit mobile version