భర్త దౌర్జన్యకాండతో విసిగి పోయానని ఇంట్లో అన్ని వస్తువులు ధ్వంసం చేశాడని, తనను రక్షించాలని ప్రాథేయపడుతూ ఈనెల ఎనిమిదో తేదీన పూర్ణానందం పేటకి చెందిన ఓ బాధితురాలు 112 కి ఫోన్ చేసింది. ఆ కాల్ రిసీవ్ చేసుకున్న 112 సిబ్బంది, సమాచారం సేకరించి సత్యనారాయణపురం నుంచి ఓ పోలీస్ కానిస్టేబుల్, ఒక హోంగార్డు సంఘటన స్థలానికి పంపింది. బాధితురాలు తన ఇంట్లో వస్తువులు ధ్వంసం చేసిన తీరును పోలీసులకు క్షుణ్ణంగా వివరించింది. తనను రక్షించాలని తీవ్ర…