ఏపీలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రచ్చరేపుతోంది. జరిగింది ఫోన్ ట్యాపింగ్ కాదు, మ్యాన్ ట్యాపింగ్ అని వైసీపీ నేతలు.. నామీద కుట్రజరుగుతోందని కోటంరెడ్డి వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. శ్రీశైలం శ్రీ మల్లికార్జునస్వామి అమ్మవారిని దర్శించుకున్నారు గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు డొక్కా మాణిక్యప్రసాద్. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి వైయస్సార్ పార్టీకి ఇక ఎటువంటి సంబంధం లేదు ఆయన మాటలన్ని టిడిపి మాటలే అన్నారు. కోటంరెడ్డి ఆరోపిస్తున్న ఫోన్ టాపింగ్ వ్యవహారం కాలమే నిర్ణయిస్తుంది.
Read Also: Madhya Pradesh: దారుణం.. చేతులు వెనక్కి కట్టి.. వృద్ధురాలని చితక్కొట్టి..
ఫోన్ టాపింగ్ వ్యవహారం అనేది ఏదో అంతర్జాతీయ కుట్రల కాశ్మీర్ బోర్డర్లో జరిగిన దానిలా ఎన్నో లీక్ అవుతాయి.కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టిడిపితో ముందే టచ్ లో ఉండి ఇప్పుడు నేను టిడిపి పార్టీ అని ఆయనే ప్రచారం చేసుకున్నాడు. లోకేష్ పాదయాత్ర ప్రజల్లో ఎలాంటి చర్చా లేదు. పాదయాత్ర ప్రారంభమైతే మొత్తం సమాజంలో చర్చ ప్రారంభం కావాలి. లోకేష్ పాదయాత్రతో సంక్షేమ పథకాలు పెంచుతారా తగ్గిస్తారా? లోకేష్ పాదయాత్ర టిడిపి రాజకీయ ఊరేగింపులా అంగు ఆర్పాటాలు తప్ప ఏమీలేదన్నారు. చంద్రబాబు వయసు పైబడి వారసత్వం కోసం పాదయాత్ర తప్ప జనాల్లో నేనున్నానని చేసే యాత్ర కాదన్నారు డొక్కా మాణిక్య వరప్రసాద్.
Read Also: Cabinet meeting: ముగిసిన కేబినెట్ భేటీ.. బడ్జెట్ కు ఆమోదం