నిద్రపోతున్న మెదడు మాత్రం మెలకువగానే ఉంటుంది. తెలుసుకున్న విషయాలను, జ్ఞాపకాలను నిక్షిప్తం చేయడం, భావోద్వేగాలను ప్రాసెస్ చేయడం వంటి పనుల్లో ఉంటుంది. ఈ ప్రక్రియ ఫలితాన్నే మెదడు మనకు కలలు అందిస్తుంటుంది. అయితే మెదడు ఇలాంటి ప్రాసెస్‌లో ఉందని చెప్పడానికి ఆధారాలు దొరకడం కష్టం అని నిపుణులు చెబుతున్నారు. ఇక బ్రెయిన్ పనిచేస్తోందని చెప్పడానికి కలలు ఓ పరోక్ష ఆధారం అంటా. ఇక పీడకలలు ఒక్కోసారి ఒక్కో విధమైన భావోద్వేగాలను కలిగి ఉంటాయి. దీన్ని కొంచెం వివరంగా చెప్పాలంటే..
1. చిన్నప్పుడు దేనికైనా భయపడితే, పెద్దయ్యాక కూడా అలాంటి పరిస్థితి ఎదురైతే మెదడు అటోమెటిక్‌గా ఆ సారూప్యాన్ని పోల్చుకుని, అదే రకమైన భావోద్వేగాన్ని ప్రతిబింబిస్తుంది. దీని ప్రొఫెసర్ కొలిన్ ఎస్పై తెలిపారు. చిన్నతనంలో జరిగిన విషయాలు కొంత మందికి గుర్తుంటాయి మరి కొంత మందికి అసలు గుర్తు ఉండవు. ఇలాంటి వారిలో గుర్తుంచుకున్న వారి జ్ఙాపకశక్తి మెరుగ్గా ఉందని అర్థం.
2. ఏదైనా ఒక విషయం గురించి భయపడుతే అలాటి కలలే వస్తాయి. ఎలాంటి కలలు కంటున్నాం అనేది మన ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. అలాగే పదే పదే ఒక వ్యక్తి గురించి మాట్లాడిన కూడా అతను కలలో వస్తాడు. ఇలా చాలా మందికి జరుగుతుంది. ఎక్కువగా దేని గురించి చర్చిస్తామో మెదడు కూడా అక్కడే ఆగిపోయింది.
3. చాలా మందికి పీడకలలు వస్తాయి. ఈ చెడు కలలు నిద్ర నాణ్యతను ప్రభావితం చేస్తాయా? అనేది మీ పీడకలల ఫ్రీక్వెన్సీ, తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. మీ చెడు కలలు అరుదుగా లేదా స్వల్పంగా ఉంటే, అవి బహుశా మీ నిద్ర నాణ్యతను ప్రభావితం చేయకపోవచ్చు. కానీ అదే పనిగా వారానికి చాలాసార్లు సంభవిస్తే అవి మిమ్మల్ని తక్కువ గాఢంగా నిద్రపోయేలా చేస్తాయి. చనిపొయిన వారిని చూసిన కూడా కొంత మంది భయపడతారు. స్మశానానికి వెళ్లిన కూడా ఆ వాతవరనం మెదడును చాలా డిస్టర్బ్ చేస్తుంది. అలాంటి వారికి ఈ పీడ కలలు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది.
4. మీరు పడుకునే విధానం, అనుభవించే విభిన్న శారీరక అనుభూతులు మీ కలలను ప్రభావితం చేస్తాయని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఒక అధ్యయనంలో ఎడమ వైపు పడుకునే వారికి పీడకలలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని తేలింది. మరొక అధ్యయనంలో బోర్ల నిద్రపోయేవారు శృంగార కలలు, పీడకలలతో సహా స్పష్టమైన కలలు కనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ కలలను ఏదో ఒక విధంగా మార్చుకోవాలనుకుంటే మీరు నిద్రించే స్థితిని పరిగణనలోకి తీసుకోవాలి.
5. తట్టుకోలేక పోతున్న రోజు అదే పీడకలలు వస్తూ ఉండటం. ఎక్కువగా కలవరించడం, నిద్రలో అరవడం,కొట్టడం, నిద్రలో నుండి లేచి నడవడం వంటివి పదే పదే మీకు జరుగుతున్నట్టయితే, మీరు వైద్యుడిని సంప్రదించాలి. మీకు నైట్మేర్ డిజార్డర్ ఉందో లేదో వారు నిర్ధారించగలరు. మీ పరిస్థితిని నిర్ధారించి చికిత్స చేసి మందులు ఇస్తారు.