బాహుబలి సినిమాతో ఒక్కసారిగా ప్రభాస్ రేంజ్ మారిపోయింది అనే చెప్పవచ్చు.. ఈ సినిమా తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారాడు.
ఈ సినిమా ఇచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ తో ఆయన ఆలోచనలు కూడా మారాయి.. ప్రెజెంట్ ప్రభాస్ చేతిలో నాలుగైదు పాన్ ఇండియా సినిమాలు అయితే ఉన్నాయి. వాటిని వరుసగా పూర్తి చేసే పనిలో వున్నాడు ప్రభాస్..ప్రభాస్ ప్రెజెంట్ చేస్తున్న సినిమాల్లో ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే మరియు మారుతి రాజా డీలక్స్ వంటి భారీ పాన్ ఇండియా సినిమాలు అయితే ఉన్నాయి. వీటిలో ఆదిపురుష్ మరో వారంలో విడుదల కాబోతుంది. ఇక సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలు షూట్ ను జరుపు కుంటున్నాయి.. ఈ రెండు దాదాపు చివరి దశకు అయితే చేరుకున్నాయి.. అలాగే రాజా డీలక్స్ షూటింగ్ కూడా సగానికి పైగానే షూట్ పూర్తి చేసుకుంది.
ఈ సినిమాలతో పాటు ప్రభాస్ లైనప్ లో మరో సినిమా ఉన్న విషయం తెలిసిందే.అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగతో ఎప్పుడో ఓకే సినిమా ను ప్రకటించాడు. స్పిరిట్ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేయగా ఈ సినిమా నుండి ఇంకా ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు.. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుందో అనే విషయంలో ఒక అప్డేట్ మాత్రం వైరల్ అయ్యింది.ఈ కాంబో నుండి తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మేకర్స్ ఈ సినిమాను ఈ ఏడాది లోనే స్టార్ట్ చేయనున్నట్టు సమాచారం. నవంబర్ నుండి ప్రభాస్ ఈ సినిమా షూట్ లో పాల్గొన బోతున్నాడు అని తాజాగా ఒక వార్త వైరల్ అవుతుంది. ప్రభాస్ సినిమాల లిస్టు లో నుండి ఆదిపురుష్ సినిమా పూర్తి అవడంతో కొత్త సినిమా షూట్ యాడ్ అయ్యిందని తెలుస్తుంది. ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి.