హనుమాన్. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది.కానీ కొన్ని కారణాలతో సినిమా విడుదల వాయిదా పడింది. అయితే ఈ సినిమాకి సంబంధించిన విడుదల తేదీ ఫిక్స్ అయినట్లు ప్రచారం జరుగుతుంది. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.నాని నిర్మించిన ‘ఆ’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు ప్రశాంత్ వర్మ. తన మొదటి సినిమాతోనే విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత యాంగ్రీ స్టార్ రాజశేఖర్ తో కల్కి సినిమా ను కూడా తీసాడు. ఆ సినిమా కమర్షియల్ గా పెద్దగా మెప్పించకపోయినా కంటెంట్ పరంగా మాత్రం అందరిని బాగానే ఆకట్టుకుంది. ఆ తర్వాత కరోనా సమయంలో చేసిన జాంబిరెడ్డి సినిమా కూడా ప్రేక్షకులు అందరినీ బాగా ఆకట్టుకుంది. ఆ తరువాత ఒక ఆసక్తికరమైన సూపర్ హీరో కథ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ప్రశాంత్ వర్మ హనుమంతుడి మీద ఒక సినిమా చేయాలని అనుకున్నాడు.దాన్ని హాలీవుడ్ రేంజ్ లో ప్రెజెంట్ చేయాలని అనుకున్నాడు ప్రశాంత్ వర్మ… తానే సొంతంగా కథ ను తయారు చేసుకున్నాడు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ నిరంజన్ రెడ్డి ఈ కథ నచ్చడంతో ప్రొడ్యూస్ చేయడానికి సిద్ధం అయ్యడు.తేజ సజ్జా ను హీరోగా ఫిక్స్ చేసారు అలాగే హీరోయిన్ గా అమృత అయ్యర్ ను తీసుకున్నారు. అలాగే ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ మరియు రాజ్ దీపక్ శెట్టి వంటి వారు ముఖ్య పాత్రలలో నటించారు.ఈ సినిమాని ఇప్పటికే విడుదల చేసి ఉండాలి.. కానీ పలు కారణాలతో సినిమాను వాయిదా వేశారు. ఈ సినిమా రిలీజ్ డేట్ తాజాగా ఫిక్స్ అయినట్లుగా తెలుస్తుంది.. ఈ సినిమాని ఆగస్టు 25వ తేదీ శుక్రవారం విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం.అత్యధిక థియేటర్లు దక్కించుకునే పనిలో వున్నట్లు తెలుస్తుంది.థియేటర్లు దక్కించుకుంటే కనుక కచ్చితంగా అదే రోజున విడుదల చేస్తారని ఈ మేరకు జూలై నెల మొదటి వారంలో అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని సమాచారం..