Raviteja: మాస్ మహారాజ్ రవితేజ కొత్త కారు కొన్నారు. ఈ సారి కాస్తంత ట్రెండ్ మార్చి ఎలక్ట్రిక్ వెహికల్ పై దృష్టి పెట్టారు. బీవైడీ-ఏటీటీఓ 3 ఎలక్ట్రిక్ కారు రిజిస్ట్రేషన్ గురువారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో పూర్తయింది. రూ.34.49లక్షల విలువజేసే ఈ కారుకు ఆర్టీఏ అధికారులు వేలంలో రూ.17,628తో టీఎస్09 జీబీ 2628 నంబర్‌ను కేటాయించారు. ఆర్టీఓ రాంచందర్, ఎంవీఐ శీనుబాబు సమక్షంలో హీరో రవితేజ డిజిటల్ సంతకం, ఫొటో ప్రక్రియ పూర్తి చేశారు.
Read Also: Hollywood: రీఎంట్రీకి రెడీ అయిన వరల్డ్ బిగ్గెస్ట్ యాక్షన్ హీరో
సేఫ్టీ విషయంలో ఈ కారుకు 5 స్టార్ రేటింగ్ కలిగి ఉంది. ఈ కారులో 12.8 ఇంచెస్ సెంట్రల్ స్క్రీన్, ఆండ్రాయిడ్, ఫరోనామిక్ సన్ రూఫ్, వైర్ లెస్ ఫోన్ ఛార్జర్, పవర్ టైల్ గేట్ లాంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఈ వెహికిల్ రిజిస్ట్రేషన్ కోసం స్వయంగా రవితేజనే ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. తమ అభిమాన నటుడిని చూసేందుకు జనం గుమిగూడారు.
Read Also: Agent: ‘ఏజెంట్’ కోసం రంగంలోకి ప్రభాస్…
ఇటీవల ధమాకా సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు రవితేజ.. తాజాగా ఆయన నటించిన రావణాసుర ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 7న భారీ ఎత్తున విడుదలైన ఈ సినిమాకు మిశ్రమస్పందన లభించింది. ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు. రవితేజ సరసన అను ఇమ్మాన్యుయేల్, పూజిత పొన్నాడ, దక్ష నగార్కర్, ఫరియా అబ్దుల్లా, మెగా ఆకాష్‌లు నటించారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌తో కలిసి రవితేజ ప్రొడక్షన్ నిర్మించింది.