కీరదోస కాయను తీసుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అందరికీ తెలిసే ఉంటుంది. వేడి కారణంగా చాలా మంది హెల్త్ ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తున్నారు. అదే విధంగా వేసవిలో శరీరానికి తగినంత పోషకాలు అందించాలి. దాని కోసం ఈ సమ్మర్‌లో రోజూ దోసకాయ తినడం మంచిది. ఇందులో పోషకాలు అనేక లాభాలను అందిస్తాయి. ఇందులో చాలా నీరు ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. మీరు దోసకాయను సలాడ్‌గా తినవచ్చు. దోసకాయలను తిన్న తర్వాత వాటి తొక్కలను పారేస్తుంటారు. దోసకాయ లాగా.. దాని తొక్క కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దోసకాయ తొక్కలో అనేక పోషకాలు ఉన్నాయి. వాటిల్లో విటమిన్ కె, విటమిన్ ఎ, విటమిన్ సి లభిస్తాయి.
READ MORE: China: సిక్కింకి 150 కి.మీ దూరంలో అత్యాధునిక స్టెల్త్ ఫైటర్ జెట్లను మోహరించిన చైనా..
ఈ తొక్కలో యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ కారణంగా.. దోసకాయ తొక్క చర్మం, జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేస్తుంది. దాని నుంచి మీరు స్క్రబ్‌ను కూడా తయారు చేసుకోవచ్చు. దోసకాయ తొక్కలను మిక్సీలో గ్రైండ్ చేసి పేస్ట్ చేయాలి. అందులో కొద్దిగా అలోవెరా జెల్, కొద్దిగా రోజ్ వాటర్ కలపండి. ఇప్పుడు దీన్ని చర్మానికి అప్లై చేసి కాసేపు మసాజ్ చేసి తర్వాత ముఖం కడుక్కోవాలి. ఇది మీకు లోతైన శుభ్రతను ఇస్తుంది. దోసకాయ తొక్కల పేస్ట్‌లో నిమ్మరసం, బేకింగ్ పౌడర్ జోడించి మీ పాదాలను శుభ్రం చేసుకోవచ్చు. ఇది మీ పాదాలను చాలా అందంగా, మృదువుగా చేస్తుంది. ఎండలో దోసకాయ తొక్కలను ఆరబెట్టండి. ఆరిన తర్వాత వాటిని గ్రైండ్ చేసి పొడి చేసుకోవాలి. ఈ పొడిలో పెరుగు మిక్స్ చేసి హెయిర్ మాస్క్ తయారు చేసి జుట్టుకు అప్లై చేయాలి. ఇది మీ జుట్టు సహజంగా మృదువుగా, అందంగా మారుతుంది. దృఢంగా చేయడంలో కూడా సాయపడుతుంది.