Satyadev-RRR: ఏంటి.. ‘ఆర్ఆర్ఆర్’లో సత్యదేవ్ నటించాడా! జక్కన్న ఎంతపని చేసే
- ఆర్ఆర్ఆర్ చిత్రంలో సత్యదేవ్
- సీన్స్ లేపేసిన రాజమౌళి
- మర్చిపోలేని అనుభూతి అంటున్న సత్యదేవ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘సత్యదేవ్’.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టిన సత్యదేవ్.. హీరోగా మారాడు. జ్యోతి లక్ష్మి, తిమ్మరుసు, గువ్వ గోరింక, గుర్తుందా శీతాకాలం, కృష్ణమ్మ సినిమాలతో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోగా మంచి పేరు సంపాదించాడు. మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ సినిమాలో విలనిజం చేసి ఆకట్టుకున్నాడు. సరికొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే సత్యదేవ్.. ‘ఆర్ఆర్ఆర్’ లాంటి పాన్ ఇండియా మూవీలోనూ నటించాడు. అయితే ఆ సీన్లన్నీ లేపేశారు.
రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో సత్యదేవ్ కూడా నటించాడట. కానీ అతడు చేసిన సీన్లను దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఎడిటింగ్‌లో లేపేశాడట. ఈ విషయాన్ని చెప్పాలా, వద్దా అని మొహమాటపడుతూనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పేశాడు. ‘ఆర్ఆర్ఆర్ కోసం దాదాపు 10 రోజులు వర్క్ చేశా. చివరకు నాకు సంబంధించి దాదాపు 16 నిమిషాల సీన్లని ఎడిటింగ్‌లో తీసేశారు. టీమ్‌పై ఉన్న గౌరవంతో ఇప్పటివరకు ఈ విషయాన్ని ఎక్కడా చెప్పలేదు. ఆ పది రోజులు వర్క్ చేయడంను మర్చిపోలేని అనుభూతి’ అని సత్యదేవ్ తెలిపాడు.
Also Read
- Janasena Party: జనసేన తెలంగాణలో కొత్త కమిటీ.. జాయినింగ్ కమిటీ కన్వీనర్‌గా ప్రేమ్ కుమార్
- Ukraine War: ఉక్రెయిన్‌లో తుస్సుమన్న పాకిస్తానీ మందుగుండు..
- B.Tech Degree: ఇక నుంచి బీటెక్ 5 సంవత్సరాలు.. ప్రతిపాదించిన ఢిల్లీ ఐఐటీ మాజీ డైరెక్టర్..
- AP Social Media Influencer Policy: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు సర్కార్ గుడ్‌న్యూస్.. ఫాలోవర్లను బట్టి పారితోషికం..
Also Read: Robinhood Teaser: నితిన్ ‘రాబిన్‌హుడ్’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్!
సత్యదేవ్, డాలీ ధనంజయ హీరోలుగా ఈశ్వర్ కార్తీక్ తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ‘జీబ్రా’. ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్ పిసినాటో కథానాయికలు. ఎస్‌ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేశ్ సుందరం సంయుక్తంగా నిర్మించారు. నవంబర్ 22న జీబ్రా రిలీజ్ అవుతోంది. నేడు జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవి ముఖ్య అతిథిగా రాబోతోన్నారు. చిరు రాకతో జీబ్రా మూవీ మీద బజ్ పెరగడం ఖాయం. ఎన్నో ప్రయోగాలు చేస్తున్న సత్యదేవ్‌కు హీరోగా సరైన బ్రేక్ మాత్రం రావడం లేదు. జీబ్రాతో అయినా హిట్ అందుకుంటాడో చూడాలి.
తాజావార్తలు
-
Food Safety : ఎక్స్పైరీ మసాలాలకు కొత్త తేదీలు.. దిల్ బహార్ యూనిట్‌పై ఎస్వోటీ దాడి
-
Janasena Party: జనసేన తెలంగాణలో కొత్త కమిటీ.. జాయినింగ్ కమిటీ కన్వీనర్‌గా ప్రేమ్ కుమార్
-
Ukraine War: ఉక్రెయిన్‌లో తుస్సుమన్న పాకిస్తానీ మందుగుండు..
-
B.Tech Degree: ఇక నుంచి బీటెక్ 5 సంవత్సరాలు.. ప్రతిపాదించిన ఢిల్లీ ఐఐటీ మాజీ డైరెక్టర్..
-
AP Social Media Influencer Policy: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు సర్కార్ గుడ్‌న్యూస్.. ఫాలోవర్లను బట్టి పారితోషికం..
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్‌షిప్ లాంచ్.!