మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ సినిమా భోళా శంకర్. ఈ సినిమా విడుదలకు సమయం దగ్గర పడింది.దీంతో ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను మెహర్ రమేష్ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.తమిళ్ సూపర్ హిట్ సినిమా అయిన వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది భోళా శంకర్.ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది.. కీర్తి సురేష్ ఈ సినిమాలో చిరు చెల్లెలుగా నటిస్తుంది. ఈ సినిమాకు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ సినిమాను ఆగస్టు 11న ఎంతో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. విడుదలకు సమయం దగ్గర పడుతుండడంతో ఈ సినిమా నుండి వరుసగా అప్డేట్స్ ఇస్తూ సినిమా పై అంచనాలు మరింత గా పెంచేస్తున్నారు.
ఈ సినిమా నుండి భోళా మ్యానియా సాంగ్ అలాగే టీజర్ విడుదల అవ్వగా వాటికి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ఇక ఇప్పుడు ఈ సినిమా సెకండ్ సాంగ్ పై మేకర్స్ అఫిషియల్ గా అప్డేట్ ను ఇచ్చారు. ఈ సినిమా నుండి మ్యూజికల్ అప్డేట్ రావడంతో మెగా ఫ్యాన్స్ మరోసారి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. నెక్స్ట్ సాంగ్ సెలబ్రేటింగ్ సాంగ్ అంటూ చెబుతూ త్వరలోనే సాంగ్ విడుదల తేదీ పై అప్డేట్ ఇస్తామని ప్రకటించారు..అంతేకాదు మహతి స్వర సాగర్ ఈ సాంగ్ కు అదిరిపోయే ట్యూన్ ఇచ్చినట్టు సమాచారం.మరి ఈ సాంగ్ ను ఎప్పుడు విడుదల చేస్తారో చూడాలి.లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి షూటింగ్ తో పాటు డబ్బింగ్ ను కూడా పూర్తి చేసి భార్య సురేఖతో కలిసి వెకేషన్ కు వెళ్ళారు..ఈ సినిమా విడుదల సమయానికి తిరిగి వచ్చి సినిమా ప్రమోషన్స్ పాల్గొనబోతునట్లు సమాచారం.