మార్పు కోసం తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించారు జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బీఅర్ఎస్, కాంగ్రెస్ లోపల కలిసి ఉండి బయటికి కొట్లాడినట్టు నటిస్తున్నాయని విమర్శించారు డీకే అరుణ. అంతేకాకుండా.. పైగా మా పైనే బట్ట కాల్చి మీద వేస్తున్నారని మండిపడ్డారు. దీన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలని, కొన్ని పత్రికలు వ్యక్తి గత అజెండా తో వ్యవహరిస్తున్నాయని డీకే అరుణ అన్నారు. కొన్ని చానల్స్, పత్రికలు ఉద్దేశపూర్వకంగా ఇతర పార్టీలను లేపే ప్రయత్నం చేస్తున్నాయని, బీజేపీ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని తెలిసిన ఈ విధంగా వ్యవహరించడం సరికాదని వ్యాఖ్యానించారు. రేపు ఉమ్మడి పాలమూరు జిల్లాలో అనేక అబివృద్ధి సంక్షేమ పథకాలకు ప్రధాని శంకుస్థాపన చేస్తారని, దేశం, రాష్ట్రం కోసం సైనికుల్లా పని చేయాల్సిన అవసరం బీజేపీ కార్యకర్తలకు ఉందన్నారు.
Also Read : Rahul Gandhi: ఒకవైపు మహాత్మా గాంధీ, మరో వైపు గాడ్సే..ఎంపీ ప్రచారంలో రాహుల్ గాంధీ..
జూరాల నీటితో ప్రాజెక్టు నిర్మిస్తే ఈ ప్రాంతం సస్యశ్యామలమయ్యేదని పేర్కొన్నారు. నార్లాపూర్ దగ్గర ఒక్క మోటర్ స్టార్ట్ చేసి నీళ్లిచ్చామని కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. బీజేపీ ఈ సారి కేంద్రంతో పాటు రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని, జూరాల నీటితో ప్రాజెక్టు నిర్మించి సాగునీటిని అందిస్తామన్నారు. రాష్ట్ర ప్రజలు కేసీఆర్ మోసపూరిత మాటలతో విసిగిపోయారని, ఈ సారి ఓడించటానికి రెడీగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేయడానికి వస్తోందని, ప్రజలు కాంగ్రెస్ మోసపు మాటలను గమనించాలని కోరారు. మహబుబ్నగర్లో జరిగే ప్రధాని సభను సక్సెస్ చేయాలని కోరారు.
Also Read : MS Dhoni: మహీ భాయ్ ఐ లవ్ యూ.. అభిమాని పిలుపుకు మిస్టర్ కూల్ ఎలా స్పందించాడంటే..!
