Site icon NTV Telugu

DK Aruna : రాహుల్ గాంధీకి పిచ్చిపట్టినట్లుంది.. ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్ధం కావట్లేదు

Dk Aruna

Dk Aruna

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి పిచ్చిపట్టినట్లుందంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీమంత్రి మతి డీకే అరుణ. ఇవాళ ఆమె మాట్లాడుతూ.. రాహుల్‌ గాంధీ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్ధం కావట్లేదని మండిపడ్డారు. మోడీ అనే పేరున్న వాళ్లంతా దొంగలే అని సంబోధిస్తారని ఆమె ధ్వజమెత్తారు. హిండెన్ బర్డ్ విషయంలో అదానీకి అనుకూలంగా తీర్పు రాబోతోందని జడ్జిల కమిటీని అవహేళన చేస్తూ న్యాయ వ్యవస్థనే కించపరుస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. లండన్ వెళ్లి ప్రధానమంత్రి నరేంద్రమోడీ భారత్ పరువు తీశారంటూ దేశ ప్రతిష్టను మంట కలపారని, రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు డీకే అరుణ.

Also Read : Mallikarjun Kharge: ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య.. రాహుల్‌ కోసం పోరాడుతాం..

‘‘దొంగల ఇంటి పేరు మోడీ’’ అంటూ చేసిన తప్పుడు వ్యాఖ్యల ఫలితంగానే రాహుల్ గాంధీకి రెండేళ్ల పాటు శిక్ష విధిస్తూ సూరత్ కోర్టు తీర్పునిస్తే బీజేపీకి సంబంధమేంటి? కోర్టు తీర్పుకు, బీజేపీకి లంకె పెడుతూ కాంగ్రెస్ గాయి గాయి చేయడం సిగ్గు చేటని ఆమె విమర్శించారు. ఇప్పటికైనా దేశంలో అణగారిన వర్గాలపై కాంగ్రెస్ అహంకారానికి రాహుల్ గాంధీ వ్యాఖ్యలు నిదర్శనం.. రాహుల్ గాంధీ కాంగ్రెస్ కు పట్టిన శని అని, ఆయన ఉన్నంత కాలం పార్టీ బాగుపడదని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. తక్షణమే రాహుల్ గాంధీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్‌ చేశారు.

Also Read : Pooja Ceremony: ‘రేవ్ పార్టీ’కి క్లాప్ ఇచ్చిన ‘ది కశ్మీరీ ఫైల్స్’ నిర్మాత!

Exit mobile version