Divyang Shakti Scheme: ‘దివ్యాంగ శక్తి’ పథకం ప్రారంభం.. ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన సీఎం, డిప్యూటీ సీఎం!
- ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రారంభించిన సీఎం
- ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం
- దివ్యాంగులతో వెళ్లే ప్రయాణికులకు 50 శాతం సబ్సిడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దివ్యాంగులకు రవాణా భారం తగ్గించేలా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ‘దివ్యాంగ శక్తి’ పథకానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా మంగళగిరి బస్టాండ్‌లో ఈ పథకాన్ని ఈరోజు అధికారికంగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా దివ్యాంగులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగ శక్తి పథకం ప్రారంభం అనంతరం సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ సహా ఇతర ప్రముఖులు దివ్యాంగులతో కలిసి పల్లె వెలుగు బస్సులో ప్రయాణించారు. మంగళగిరి బస్టాండ్ నుంచి ప్రారంభమైన ఈ బస్సు యాత్ర డాన్‌బాస్కో స్కూల్ మీదుగా డోలాస్ నగర్, ప్రకాశ్‌నగర్, నులకపేట, ఉండవల్లి సెంటర్ మీదుగా పెనుమాక వరకు కొనసాగింది. బస్సు ప్రయాణంలో ముఖ్యమంత్రి దివ్యాంగులతో నేరుగా ముచ్చటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి అందుతున్న సంక్షేమ పథకాలు, పెన్షన్లు, ఇతర సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. దివ్యాంగుల బాగోగుల పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని, వారి సాధికారతకు తమ వంతు కృషి చేస్తామని సీఎం ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
Also Read
దివ్యాంగ శక్తి పథకం ప్రారంభ కార్యక్రమానికి ప్రజలు, కూటమి పార్టీల కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులను చూసేందుకు జనం పోటీ పడటంతో మంగళగిరి పరిసర ప్రాంతాలు కోలాహలంగా మారాయి. దివ్యాంగుల పట్ల ప్రభుత్వం చూపుతున్న ఈ చొరవపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక దివ్యాంగులతో పాటు ప్రయాణించే సహాయకులకు కూడా ప్రభుత్వం ఊరట కల్పించింది. వారికి బస్సు చార్జీల్లో 50 శాతం రాయితీ ఇస్తోంది. ఈ పథకం ద్వారా మొత్తం 12.76 లక్షల మంది దివ్యాంగులు, వారి సహాయకులు లబ్ధి పొందనున్నారు. ఈ పథకాన్ని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంవత్సరానికి సుమారు రూ.207 కోట్ల వ్యయం అవుతుందని అంచనా.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!