జనగామ జిల్లాలోని స్టేషన్ ఘనపూర్ డివిజన్ కేంద్రంలో సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి చెక్కుల పంపిణీ చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ గానీ కాంగ్రెస్ పార్టీ గాని తెలంగాణకు వరగబెట్టింది ఏమీ లేదు అంటూ విమర్శించారు. కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఆర్థిక సహాయం చేయలేదు అని ఆగ్రహం వ్యక్తం చేందారు.
Also Read : Maruti Suzuki : మేలో 1.78 లక్షల యూనిట్ల మారుతి వాహనాల అమ్మకం.. అత్యధికంగా అమ్ముడైనవి ఇవే
విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేయడం లేదు అంటూ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెడితే అధికారం మరిచిపోయి.. ప్రజల సంక్షేమం మర్చిపోయి దోచుకోవడమే పనిగా వాళ్లు రాజకీయం చేస్తారు అని ఆయన విమర్శలు గుప్పించారు. అనేక రకాలైన అవినీతి కుంభకోణాలలో కూరుకుపోయిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది.. కుక్కలు చింపిన ఇస్తరి వలె ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఉందంటూ ఎద్దేవా చేశారు.
Also Read : Toll Plaza Rules Change: హైవేపై ప్రయాణీకులకు శుభవార్త! నేటి నుంచి టోల్ ట్యాక్స్ నిబంధనలలో భారీ మార్పు!
కాంగ్రెస్ నాయకుల నాయకత్వంలో పస లేదు.. ప్రజా సమస్యల పైన పోరాటం చేసే తపన వారిలో కనపడం లేదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండు కూడా ప్రజలకు ఉపయోగపడే పార్టీలు కాదు.. భారత రాష్ట్ర సమితి మాత్రమే మన ఇంటి పార్టీ.. తెలంగాణ అభివృద్ధిని.. తెలంగాణ హక్కులను కాపాడే పార్టీ అంటూ తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టాలనేదే మన ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు.