NTV Telugu Site icon

JioHotstar: ఓటీటీ ప్రపంచంలో సత్తా చూపడానికి సిద్దమవుతున్న జియోహాట్‌స్టార్!

Jio Hotstar (1)

Jio Hotstar (1)

JioHotstar: తాజాగా డిస్నీ స్టార్ ఓటీటీ లవర్స్‌కు ఒక అదిరిపోయే న్యూస్ చెప్పింది. త్వరలోనే ‘జియోహాట్‌స్టార్’ పేరిట ఒక కొత్త స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించబోతున్నట్లు ప్రకటించింది. ఇది జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్ లను కలిపిన ప్లాట్‌ఫామ్ అని చెప్పవచ్చు. “స్ట్రీమింగ్‌లో సరికొత్త శకం” అంటూ డిస్నీ స్టార్ సంస్థ ఈ కొత్త ప్లాట్‌ఫామ్‌ కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది. ఇకపై ఈ రెండు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ల కంటెంట్‌ను ఒకే యాప్‌లో చూడగలుగుతాం.

Also Read: Akira Nandan : అకీరా నందన్ గడ్డం పై సోషల్ మీడియాలో డిబేట్.. అసలు అది నిజమేనా ?

గత కొంతకాలంగా జియోహాట్‌స్టార్ గురించి అనేక విషయాలు వినిపిస్తున్నాయి. డిస్నీ+ హాట్‌స్టార్ యాప్‌లో “జియోహాట్‌స్టార్” పేరు కనిపించడం, పలు యాడ్స్‌లో కూడా ఇదే పేరును చూడటం అన్నీ దీని నిజం అనేది స్పష్టమయ్యేలా చేశాయి. ఇప్పుడు ఈ రెండు ప్లాట్‌ఫామ్‌లు కలిసి పనిచేయబోతున్నాయి. నిజానికి, ఈ వ్యవహారం గత ఏడాది నుంచే ఆరంభమైంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, వయాకామ్18, వాల్ట్ డిస్నీ కంపెనీలు కలిసి ఈ బిజినెస్‌ను మరింత సమ్మిళితంగా తీసుకురావాలని నిర్ణయించుకున్నాయి.

ఇందుకు సంబంధించి మరో ముఖ్యమైన విషయమేమంటే.. జియో సినిమా ఆటోపే సబ్‌స్క్రిప్షన్లు ఇప్పుడే తీసుకోవడం ఆపేసింది. దీనిని చూస్తుంటే, కొత్త ప్లాట్‌ఫామ్‌ కోసం కొత్త ధరలు, మరికొన్ని ప్లాన్స్ తీసుకొరావడంలో ఉన్నారనడంలో సందేహం లేదు. అలాగే నేటి నుంచి మొదలయ్యే వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) మ్యాచ్‌లు జియోహాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో లైవ్ ప్రసారం అవుతాయంటున్నారు. జియోహాట్‌స్టార్ ప్లాట్‌ఫామ్‌లో స్పోర్ట్స్‌కు కూడా పెద్ద ప్రాధాన్యం ఇవ్వబడుతుందని అర్థమవుతోంది. క్రికెట్‌ ప్రియులు ఈ కొత్త ప్లాట్‌ఫామ్ ద్వారా ఎలాంటి కొత్త అనుభవం పొందనున్నారు. డిస్నీ+ హాట్‌స్టార్ యాప్‌లో జియో సినిమా ఒరిజినల్స్, కలర్స్ రిష్తే ప్రోగ్రామ్స్ కూడా ప్రారంభమయ్యాయి. దీనిని బట్టి, ఈ రెండు ప్లాట్‌ఫామ్‌లు అతి త్వరలో కలవడానికి రెడీ అవుతున్నాయని స్పష్టమవుతోంది.

Also Read: F-35 fighter jet: భారత్‌కి ట్రంప్ F-35 ఆఫర్.. అత్యాధునిక స్టెల్త్ ఫైటర్ ప్రత్యేకతలు ఇవే..

ఈ రెండు ప్లాట్‌ఫామ్‌ల కలయిక ద్వారా యూజర్లకు ఒకటే ప్లాట్‌ఫామ్ ద్వారా రెండు రకాల కంటెంట్ సంబంధించిన డబుల్ బెనిఫిట్స్ లభిస్తాయని చెప్పవచ్చు. బాలీవుడ్, హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ సినిమాలు, ఇంకా భారతదేశంతో పాటు.. ఇంటర్నేషనల్ టీవీ షోలు, క్రికెట్ టోర్నమెంట్‌లు, జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్ స్పెషల్ సిరీస్‌లు ఇలా చాలా అద్భుతమైన కంటెంట్ లభించనుంది. మొత్తానికి జియోహాట్‌స్టార్ విడుదల అయితే, ఇండియన్ ఓటీటీ మార్కెట్‌లో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ZEE5, సోనీలీవ్ వంటి ప్లాట్‌ఫామ్‌లకు ఇది గట్టి పోటీగా నిలుస్తుంది. ఈ కొత్త జియోహాట్‌స్టార్ ప్లాట్‌ఫామ్ సబ్‌స్క్రిప్షన్ ధరలు తక్కువగా ఉంటే, ఇతర ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు కష్టాలు పడాల్సిందే.