Discount on Traffic Challans: పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై వాహనదారులకు శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం.. పేరుకుపోయిన చలాన్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది.. ఈ నెల 26వ తేదీ నుంచి జనవరి 10వ తేదీ వరకు చలాన్లపై ఈ డిస్కౌంట్ కొనసాగనుంది.. సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్‌లపై తగ్గింపును గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అధికారులు తెలిపారు.. ఈ చలాన్ ట్రాఫిక్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకునే అవకాశం ఇస్తున్నారు.
ఇక, ఈ తగ్గింపులు డిసెంబర్ 30, (శనివారం) 2023న అంటే వచ్చే వారం తెలంగాణ హైకోర్టు పర్యవేక్షణలో నిర్వహించబడే మెగా జాతీయ లోక్ అదాలత్‌ను దృష్టిలో ఉంచుకుని తీసుకొచ్చారు. వాహనదారులు తమ వాహనాలపై పెండింగ్‌లో ఉన్న చలాన్‌లను కలిగి ఉన్న వ్యక్తులు ఈ నెల 26వ తేదీ నుంచి ఈ చలాన్ ట్రాఫిక్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో వాటిని క్లియర్ చేయవచ్చు.. ఈ డిస్కౌంట్ ఆఫర్ 2024 జనవరి 10వ తేదీ వరకు కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం అందించే డిస్కౌంట్లు.. ఏ వాహనంపై ఎంత?
1) తోపుడు బండ్లు (39వీ కేసులు) 10 శాతం చెల్లించాలి.. అంటే వారిపై ఉన్న చలాన్లలో 90 శాతం మినహాయించబడుతుంది.
2) ఆర్టీసీ డ్రైవర్లు తమ చలాన్లను 10 శాతం చెల్లిస్తే సరిపోతుంది.. అంటే వారికి కూడా 90 శాతం మినహాయించబడింది.
3) ద్విచక్ర వాహనలు, ఆటోలు మొదలైన త్రిచక్ర వాహనదారులు 20 శాతం చెల్లించాల్సి ఉంటుంది.. వీరికి 80 శాతం మినహాయించబడుతుంది.
4) కార్లు సహా నాలుగు చక్రాల వాహనాలు, మరియు HMVలు (ట్రక్కులు మొదలైనవి) 40 శాతం చెల్లించాలి.. వాటిపై 60 శాతం మినహాయించబడుతుంది.
కాగా, మార్చి 2022లో ఇచ్చిన చివరి తగ్గింపు ఆఫర్ సమయంలో హైదరాబాద్/ సైబరాబాద్/ రాచకొండ నుండి చాలా మంది ప్రయాణికులు ఈ తగ్గింపు ఆఫర్‌ను ఉపయోగించుకున్నారు.. వారి పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకున్నారు.. కానీ, జిల్లాల్లో, రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల నుండి అవగాహన లోపం కారణంగా చాలామంది డిస్కౌంట్ ఆఫర్‌ను సరిగ్గా వినియోగించుకోలేదని.. ప్రభుత్వం ఇచ్చిన ఈ డిస్కౌంట్ ఆఫర్‌కు ఇప్పుడు విస్తృత ప్రచారం కల్పించాలని మరియు వారి వాహనాలపై పెండింగ్‌లో ఉన్న చలాన్‌లను క్లియర్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు అధికారులు.