CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TFDA meets Telangana CM Revanth Reddy: ఆదివారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో డైరెక్టర్స్ డే సెలబ్రేషన్స్‌ను తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఘనంగా నిర్వహించబోతోంది. ఈ వేడుక రావాల్సిందిగా అసోసియేషన్ సభ్యులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందజేశారు. అసోసియేషన్ అధ్యక్షుడు వీరశంకర్, వైస్ ప్రెసిడెంట్ వశిష్ట, దర్శకులు అనిల్ రావిపూడి, హరీశ్ శంకర్ శుక్రవారం (మే 17) సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆహ్వానాన్ని అందజేశారు.
Also Read: Sonakshi Sinha: అందుకే మనీషా కొయిరాలకు సారీ చెప్పా!
Also Read
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
డైరెక్టర్స్ డే సెలబ్రేషన్స్ వేడుకకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తానని చెప్పినట్లు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డికి మంచి విజన్ ఉందని, ప్రపంచ సినిమాకు టాలీవుడ్ హబ్‌గా మారేలా చేద్దామని సీఎం చెప్పినట్లు టీఎఫ్‌డీఏ అధ్యక్షుడు వీరశంకర్ తెలిపారు. వీర శంకర్ మాట్లాడుతూ… ‘శుక్రవారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి గారిని నేను, హరీశ్ శంకర్, అనిల్ రావిపూడి, వశిష్ట కలిశాం. ఐదు నిమిషాలు మాట్లాడాలని కోరితే.. సుమారు గంట సేపు మాతో మాట్లాడారు. సినిమా ఇండస్ట్రీ గురించి సీఎం మాట్లాడటం చాలా సంతోషంగా అనిపించింది. చిత్ర పరిశ్రమ అభివృద్ధి గురించి సీఎం గారి విజన్‌కు ఆశ్చర్యం వేసింది. ప్రపంచ సినిమా హబ్‌గా టాలీవుడ్ మారాలని, ఆ దిశగా ప్రభుత్వం సహకారం అందిస్తుందని చెప్పారు. వరల్డ్ క్లాస్ ఫిలిం ఇనిస్టిట్యూట్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించాం. డైరెక్టర్స్ డేను ప్రపంచమంతా గుర్తుపెట్టుకునేలా ఈ ఈవెంట్ చేస్తున్నాం. సీఎం తప్పకుండా వస్తామని మాటిచ్చారు’ అని చెప్పారు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!