Harom Hara Movie: క్లైమాక్స్ మతి పోయేలా ఉంటుంది.. ఊహించని సినిమా ఇది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gnanasagar Dwaraka on Harom Hara Movie Climax: సుధీర్ బాబు, మాళవిక శర్మ జంటగా నటించిన చిత్రం ‘హరోం హర’. జ్ఞానసాగర్ ద్వారక తెరకెక్కిస్తున్న ఈ సినిమాను శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ జీ నాయుడు నిర్మించారు. చిత్తూరు జిల్లా కుప్పంలోని 1989 నాటి పరిస్థితుల నేపథ్యంలో రూపొందిన ఈ యాక్షన్ సినిమా జూన్ 14న విడుదల కానుంది. ఇప్పటికే హరోం హర నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ అంచనాలు పెంచాయి. ప్రమోషన్స్‌లో భాగంగా మంగళవారం రాత్రి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ జ్ఞానసాగర్ చిత్ర విశేషాలు పంచుకున్నారు.
హరోం హర క్లైమాక్స్ మతి పోయేలా ఉంటుందని దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారక తెలిపారు. ‘ఈ సినిమాలో సుధీర్ బాబు అద్భుతంగా నటించారు. ఆయనలో ఓ స్వాగ్ ఉంటుంది. అది హరోం హరలో చక్కగా బయటకొచ్చింది. కుప్పం యాసలో సుధీర్ పలికే సంభాషణలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయి. సినిమా బాగా వచ్చింది. సినిమా క్లైమాక్స్ మతి పోయేలా ఉంటుంది. తప్పకుండా సుధీర్ నుంచి ఊహించని సినిమా అవుతుందనే నమ్మకం ఉంది’ అని జ్ఞానసాగర్ అన్నారు.
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్‌కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
Also Red: Kalki 2898 AD: కల్కి చిత్రంలో ‘పెరుమాళ్లపాడు’ నాగేశ్వరస్వామి ఆలయం!
‘నా మొదటి చిత్రం సెహరి చూసి సుధీర్ బాబు సతీమణి ఆయనకు నా గురించి చెప్పారట. కథ వినిపించగానే.. తొలి సిట్టింగ్‌లోనే ఒకే చెప్పారు. మనం సినిమా చేద్దామన్నారు. అలా హరోం హర పట్టాలెక్కింది. ఇందులో సుబ్రహ్మణ్యం అనే పాత్రలో సుధీర్ నటించారు. కుప్పంలో ల్యాబ్ అసిస్టెంట్‌గా పని చేసే ఓ వ్యక్తి.. తుపాకులు తయారు చేయడం మొదలు పెట్టి పవర్ఫుల్ సుబ్రహ్మణ్యగా ఎలా ఎదిగాడన్నది ఆసక్తికరంగా చూపించాం. సినిమాలో ఆధ్యాత్మిక కోణం కూడా ఉంటుంది’ అని దర్శకుడు జ్ఞానసాగర్ చెప్పారు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!