ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఇప్పుడు స్పెషల్‌గా బాలీవుడ్‌పై దృష్టి సారించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై హిందీలో అగ్రతారలతో వరుస ప్రాజెక్టులు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు స్వయంగా వెల్లడించారు. వచ్చే ఏడాది తమ ఎస్వీసీ సంస్థ నుంచి మొత్తం ఆరు సినిమాలు హిందీలో విడుదల కానున్నాయని దిల్‌రాజు తెలిపారు. ముఖ్యంగా అక్షయ్ కుమార్ – అనీస్ బాజ్మీ కాంబినేషన్‌లో తెలుగులో విజయవంతమైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు హిందీ రీమేక్‌ను నిర్మించనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతుండగా, 2026లో షూటింగ్ ప్రారంభించి అదే ఏడాదిలో విడుదల చేయాలని యూనిట్ ప్లాన్ చేస్తోంది. అలాగే సల్మాన్ ఖాన్ – వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో మరో భారీ చిత్రం చేయనున్నట్లు నిర్మాత శిరీష్ వెల్లడించారు. తెలుగులో విజయ్ దేవరకొండ – కీర్తి సురేశ్ జంటగా నిర్మిస్తున్న ‘రౌడీ జనార్ధన’ సినిమా కూడా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read : Samantha-Raj : ఇవాళే సమంత పెళ్లి – పోస్ట్ వైరల్..?
ఇంకా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ విషయానికి వస్తే, ‘స్కై ఫోర్స్’, ‘కేసరి చాప్టర్ 2’, ‘జాలీ ఎల్‌ఎల్‌బీ 3’ వంటి చిత్రాలతో ఈ ఏడాది విజయవంతంగా ముగించుకున్న ఆయన, కొత్త సంవత్సరాన్ని భారీ ప్రాజెక్టులతో స్వాగతించడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా అక్షయ్ – సాజిద్ ఖాన్ కాంబినేషన్‌లో మరో భారీ సినిమా రూపొందుతున్నట్లు సమాచారం. చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాకపోయినా, ఏక్తా కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ వేగంగా జరుగుతుండగా, వచ్చే ఏడాది జూలైలో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ‘హేయ్ బేబీ’, ‘హౌస్‌ఫుల్’ వంటి హిట్స్‌తో ఇప్పటికే బెస్ట్ కాంబినేషన్‌గా పేరుగాంచిన అక్షయ్ – సాజిద్ ఈసారి ఏ రేంజ్ మేజిక్ చూపిస్తారో ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది.