ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఇప్పుడు స్పెషల్‌గా బాలీవుడ్‌పై దృష్టి సారించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై హిందీలో అగ్రతారలతో వరుస ప్రాజెక్టులు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు స్వయంగా వెల్లడించారు. వచ్చే ఏడాది తమ ఎస్వీసీ సంస్థ నుంచి మొత్తం ఆరు సినిమాలు హిందీలో విడుదల కానున్నాయని దిల్‌రాజు తెలిపారు. ముఖ్యంగా అక్షయ్ కుమార్ – అనీస్ బాజ్మీ కాంబినేషన్‌లో తెలుగులో విజయవంతమైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు హిందీ రీమేక్‌ను నిర్మించనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతుండగా, 2026లో…