గత కొద్ది రోజులుగా, అగ్ర నిర్మాత దిల్ రాజు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) బ్యానర్‌పై రాబోయే కొత్త సినిమాల గురించి రకరకాల వార్తలు, ఊహాగానాలు పుట్టుకొస్తున్నాయి. ఏవేవో పాత విషయాలను పట్టుకుని, ఇప్పుడు జరుగుతున్న కొత్త ప్రాజెక్ట్‌లకు లింక్ చేసి వార్తలు పుట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఈ రూమర్స్‌కు ఒక ఫుల్‌స్టాప్ పెట్టే ఉద్దేశంతో దిల్ రాజు టీమ్ తాజాగా ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
Also Read : Samantha–Raj : ఫోటోలు వైరల్.. ఫిబ్రవరిలోనే సమంత-రాజ్ ఎంగేజ్మెంట్ .. !
తాము ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ గారితో ఓ భారీ ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేస్తున్నామని దిల్ రాజు కన్ఫర్మ్ చేశారు. ‘ఈ సినిమాకు సెన్సేషనల్ డైరెక్టర్ అనీస్ బజ్మీ దర్శకత్వం వహించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది, అంటే స్క్రిప్ట్ వర్క్, నటీనటుల ఎంపిక, ఇతర సన్నాహాలు జరుగుతున్నాయన్నమాట. మా ప్రాజెక్ట్‌ల గురించి బయట వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు. అవన్నీ కేవలం పుకార్లు మాత్రమే. మా నుంచి కన్ఫర్మేషన్ వచ్చేంత వరకు, దయచేసి ఎవరూ సొంతంగా అంచనాలు వేయడం, లేనిపోని వార్తలు ప్రచారం చేయటం ఆపాలని మీడియా మరియు ప్రేక్షకులను కోరుతున్నాము. అలాగే ఈ సినిమా గురించి ఎలాంటి అప్ డేట్‌లు అయిన మేమే స్వయంగా మీతో పంచుకుంటాం’ అని నిర్మాణ సంస్థ స్పష్టం చేసింది. మొత్తానికి, దిల్ రాజు – అక్షయ్ కుమార్ – అనీస్ బజ్మీ కాంబినేషన్ దాదాపు ఫిక్స్ అయిందని ఈ ప్రకటన ద్వారా క్లారిటీ వచ్చేసింది. ఇక త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పెద్ద అప్‌డేట్ కోసం ఎదురుచూడాల్సిందే!