Dil Raju on Family Star Movie Negative Publicity: సినిమా విడుదలైన మొదటి మూడు రోజులు రివ్యూలు, రేటింగ్‌లు ఇవ్వకూడదంటూ కేరళలో కోర్టు తీర్పు ఇచ్చిందని.. అలాంటి చట్టం వస్తే కానీ ఇండస్ట్రీ బాగుపడదని నిర్మాత దిల్‌రాజు అన్నారు. సినిమాపై నెగెటివ్ ప్రచారం ఇండస్ట్రీకి మంచిది కాదన్నారు. పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ కాంబోలో వచ్చిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోంది. ఈ నెగెటివ్ ప్రచారంపై నిర్మాత దిల్‌రాజు స్పందించారు.
‘ఫ్యామిలీ స్టార్‌పై ప్రేక్షకుల స్పందన ఒకలా ఉంటే, సోషల్ మీడియాలో మరోలా ట్రోల్ చేస్తున్నారు. సినిమా చూసిన ప్రేక్షకులు బాగుందని అంటున్నారు. అందరూ సినిమాను ఆస్వాదిస్తున్నారు. మేం ఓ మంచి సినిమా తీశాం. మీరు థియేటర్‌కు వచ్చి చూసి.. నచ్చితే నలుగురికి చెప్పండి. నచ్చకపోతే మీ అభిప్రాయాన్ని నేనూ గౌరవిస్తా. చాలా మంది సినిమా తమకు నచ్చిందని ఫోన్లు, మెసేజ్‌లు చేస్తున్నారు. సినిమాకు ఎందుకలా నెగెటివ్ ప్రచారం చేస్తున్నారని మరికొందరు అడుగుతున్నారు. రిలీజ్ కాకముందు నుంచే నెగెటివ్ ప్రచారం మొదలు పెట్టారని చెబుతున్నారు’ అని దిల్‌రాజు తెలిపారు.
Also Read: Rashmika Mandanna: డైలాగ్ బాగాలేదని ట్రోల్ చేస్తున్నారు.. ఎలా నటించాలో నాకు తెలుసు: రష్మిక
‘కేరళలో సినిమా విడుదలైన మొదటి మూడు రోజులు రివ్యూలు, రేటింగ్‌లు ఇవ్వకూడదంటూ కోర్టు తీర్పు ఇచ్చిందట. అలాంటి చట్టం వస్తే కానీ ఇండస్ట్రీ బాగుపడదు. నెగెటివ్ ప్రచారం ఎవరెవరిపై ప్రభావం చూపుతుందో ఆలోచించడం లేదు. కష్టపడి సినిమా తీసిన నిర్మాతలు నష్టపోతున్నారు. రాబోయే రోజుల్లో ఈ నెగెటివ్ ప్రచారం మరింత నష్టం చేకూరుస్తుంది. సినిమాలు తీయాలన్న ఆలోచన కూడా రాదు. సినిమా బాగోలేదనిపిస్తే.. అది మీ వ్యక్తిగత అభిప్రాయం. దాన్ని సోషల్ మీడియాలో రుద్దడం సరికాదు’ అని దిల్‌రాజు ఫైర్ అయ్యారు.