Rashmika Mandanna: డైలాగ్ బాగాలేదని ట్రోల్ చేస్తున్నారు.. ఎలా నటించాలో నాకు తెలుసు: రష్మిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rashmika on Animal Movie Trolls: ‘యానిమల్’ సినిమాతో కన్నడ సోయగం రష్మిక మందన్న భారీ హిట్ ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. గీతాంజలి పాత్రలో రష్మిక తనదైన నటనతో ఆకట్టుకున్నారు. అయితే కర్వాచౌత్ పండగ సందర్భంలో వచ్చే సన్నివేశంలో డైలాగులు సరిగ్గా చెప్పలేదంటూ ఆమెపై విమర్శలు వచ్చాయి. చాలా మంది రష్మిక డైలాగ్ డెలివరీని విమర్శించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ ట్రోలింగ్‌పై నేషనల్ క్రష్ రష్మిక స్పందించారు. 9 నిమిషాల సీన్‌లో 10 సెకన్ల డైలాగ్ బాగాలేదని తనను ట్రోల్స్ చేశారని, ఎలాంటి సన్నివేశాలకి ఏ విధంగా నటించాలో తనకు తెలుసని గట్టి కౌంటర్ వేశారు.
‘నో ఫిల్టర్ నేహా’ ఇంటర్వ్యూలో రష్మిక మందన్న మాట్లాడుతూ… ‘యానిమల్ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో నా ముఖం, నటన, డైలాగ్ డెలివరీ బాగాలేదని విమర్శిస్తున్నారు. కర్వాచౌత్ సన్నివేశం గురించి ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు. ఆ సన్నివేశం సినిమాకే ప్రత్యేకం. ఒక్క సీన్‌లోనే ఎన్నో హావభావాల్ని పలికించాల్సి వచ్చింది. అందుకోసం నేనెంత కష్టపడ్డానో నాకు మాత్రమే తెలుసు. జనాలకు ఇదేమీ తెలియదు. ఆ సన్నివేశంలో నా నటన చూసి సెట్లో మంచి ప్రశంసలు వచ్చాయి. 9 నిమిషాల సీన్‌లో 10 సెకన్ల డైలాగ్ బాగాలేదని నన్ను ట్రోల్స్ చేశారు. ఎలాంటి సన్నివేశాలకి ఏ విధంగా నటించాలో నాకు తెలుసు. అందరికీ అన్నీ నచ్చాలని లేదుగా’ అని అన్నారు.
Also Read
Also Read: Mumbai Indians: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్!
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ‘యానిమల్’లో రణ్‌బీర్ కపూర్, రష్మికతో పాటు అనిల్ కపూర్, ట్రిప్తి డిమ్రీ, బాబీ డియోల్ కూడా నటించారు.ప్రస్తుతం రష్మిక ‘ఛవా’లో విక్కీ కౌశల్‌తో కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రం ఛత్రపతి శంభాజీ మహరాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రష్మిక ఛత్రపతి భార్య పాత్రలో నాకనిపిస్తునారు. మరోవైపు ‘పుష్ప 2’ కూడా చేస్తున్నారు.
తాజావార్తలు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
-
Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
-
Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!