కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన చిత్రం కాంతార చాఫ్టర్ట్ 1. 2022 లో వచ్చిన కాంతార కు ప్రీక్వెల్ గా తెరకెక్కిన చాఫ్టర్ 1 దసరా కానుకగా అక్టోబరు 2న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. ప్రీమియర్స్ నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ వసూళ్లు రాబడుతోంది. అక్కడ ఇక్కడా అని తేడా లేకుండా అన్ని సెంటర్స్ లోను మంచి వసూళ్లు రాబడుతోంది.
Also Read : OTT : ఓటీటీలో ఈ వారం చూడదగ్గ సినిమాలు ఇవే
అయితే ఈ సినిమాలో దర్శకుడు కమ్ హీరో రిషబ్ శెట్టి భార్య ప్రగతి రిషబ్ శెట్టి కూడా ఓ చిన్న పాత్ర పోషించింది. సినిమా వెళ్తున్న ఫ్లోలో అంతగా గమనించరు కానీ జాగ్రత్తగా గమనిస్తే ప్రగతి కాంతర చాప్టర్ 1లో ఓ సీన్ లో తళుక్కున మెరిసింది. సినిమాలో కీలకమైన రధం సీన్ లో రిషబ్ శెట్టి వీరోచితంగా పోరాడే సమయంలో ఒక లేడిని కాపాడబోయే క్రమంలో కిందపడతాడు. అక్కడ రిషబ్ కాపాడే లేడి పాత్రలో ప్రగతి రిషబ్ శెట్టి కనిపిస్తుంది. కానీ ఇది కేవలం కొన్ని సెకండ్స్ మాత్రమే కనిపించే సీన్. ఇక కాంతార లో కూడా ప్రగతి కనిపించిందని మీకు తెలుసా. కాంతారలో సినిమా స్టార్టింగ్ లో కనిపించే రాజు కు భార్యగా పిల్లాడిని ఎత్తుకుని కనిపిస్తుంది ప్రగతి రిషబ్ శెట్టి. భర్త డైరెక్ట్ చేసిన బిగ్గెస్ట్ సినిమాలో ప్రగతి కూడా స్క్రీన్ షేర్ చేసుకుని కాంతార, కాంతార చాప్టర్ 1లో భాగమైంది. ఇక ఇటీవల విడుదలైన కాంతార చాప్టర్ 1 సక్సెస్ పట్ల భావోద్వేగానికి గురైంది ప్రగతి రిషబ్. కన్నడ సినీ పరిశ్రమ ట్రెండ్ సెట్టింగ్ సినిమాను అందించిన భర్త రిషబ్ ను చూసి ప్రౌడ్ గా ఫీలయింది ప్రగతి.