చిన్న సినిమాగా వచ్చి అద్భుతమైన సక్సెస్ సాధించిన మూవీ లిటిల్ హార్ట్స్. మౌళి, శివాని నగరం జంటగా నటించిన ఈ మూవీ ఎంతో ఫ్రెష్ గా, వాస్తవికతకు దగ్గరగా ఉండడంతో టీనేజ్ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. ట్రైలర్ చూసిన తర్వాత, పెట్టుకున్న ఎక్సపెక్టషన్స్ కి ఏమాత్రం తగ్గకుండా ఆడియన్స్ ని కట్టిపడేసిన ఈ సినిమా అక్టోబర్ 1 నుండి ఓటిటి లో స్ట్రీమ్ అవుతోంది. ఈ టీవీ విన్ లో స్ట్రీమ్ అవుతోన్న ఈ మూవీలో కొన్ని అదనపు సన్నివేశాలను జోడించడం ఓ విశేషం.
Also Read : Rebel Star : రాధేశ్యామ్ డైరెక్టర్ తో రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా
వరుస హిట్లతో దూసుకుపోతున్న శివకార్తికేయన్ హీరోగా, ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన మూవీ మదరాసి. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా విద్యుత్ జంవాల్ కీలక పాత్రల్లో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్, థియేటర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సెప్టెంబర్ 5 న థియేటర్లలో రిలీజ్ అయిన మదరాసి, అక్టోబర్ ఫస్ట్ నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. రాధాక్రిష్ణ దర్శకత్వంలో వచ్చిన మూవీ జూనియర్, జులై 18 న థియేటర్లలో కన్నడ, తెలుగు భాషల్లో రిలీజ్ అయింది. గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి హీరోగా, శ్రీ లీల హీరోయిన్ గా, జెనీలియా ముఖ్య పాత్రలో నటించిన ఈ మూవీ ప్రేక్షకులతో ఒకే అనిపించుకుంది. ఇందులోని వైరల్ వయ్యారి సాంగ్ విపరీతంగా ట్రెండ్ అయ్యింది. కిరీటి, శ్రీలీల ఒకరికొకరు తీసిపోకుండా స్పెప్పులు ఇరగదీసారు. సెప్టెంబర్ 30 నుండి అమెజాన్ ప్రైమ్ అండ్ ఆహాలో స్ట్రీమ్ అవుతోంది. ఓటిటిలోకి రావటానికి చాలా టైం తీసుకున్న తక్కువ సినిమాల్లో ఇదొకటి.