ఇప్పటి సీఎం అప్పటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జన్వాడ ఫామ్ హౌస్ పోతే డ్రోన్లు ఎగురవేశారని కేసులు పెట్టారని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఇప్పుడెందుకు కేటీఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారన్నారు. ఆయన మరి ఆ రోజే ఫామ్ హౌస్ నాది కాదని కేటీఆర్ చెబితే అయిపోవు కదా?.. కానీ ఇప్పుడు ఇతరుల పేరుపై మార్చి నాది కాదు అంటే ఎలా? అని ప్రశ్నించారు.
కేశినేని నాని ఎపిసోడులో దేవినేని అవినాష్ - గద్దె రామ్మోహన్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. కేశినేనిని చంద్రబాబు అవమానించారని అవినాష్ అన్నారు. అంతేకాకుండా.. క్యాష్ కొట్టు.. సీటు పట్టు అనే విధానం టీడీపీలో ఉందంటూ అవినాష్ సెటైర్లు వేశారు. ఈ క్రమంలో.. అవినాష్ కు టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కౌంటర్ ఇచ్చారు.